గత కొంత కాలంగా అమెరికాలో జాత్యహంకారం బాగా పెరిగిపోయింది.  ఇప్పటికే పలువురు భారతీయులపై కొంతమంది ఉన్మాదులు దాడి చేసి అన్యాయంగా చంపిన విషయం తెలిసిందే.  తాజాగా అమెరికా చికాగోలో కారు పార్కింగ్ వద్ద గుర్తు తెలియని జరిపిన కాల్పుల్లో హైదరబాద్ ప్రాంతానికి చెందిన విద్యార్థి మహ్మద్ అక్బర్ తీవ్ర గాయాలకు గురైయ్యారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికాగోలో వైద్యులు అత్యవసర సేవలను అందిస్తున్నారు.

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ అన్నపూర్ణ కాలనీ డైమండ్ ఎన్‌క్లేవ్ ఫ్లాట్ నెం.102లో నిర్వహిస్తున్న యూసుఫ్‌కు ఆరుగురు కుమారులు. ఈ సంతానంలో మూడో కుమారుడు మహ్మద్ అక్బర్ ఉన్నత చదువు కోసం మూడు సంవత్సరాల కిందట ఎఫ్1-వీసా మీద అమెరికా చికాగోకు వెళ్ళారు.  డెవ్రీ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ నెట్‌వర్కింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కోర్సులో విద్యాభ్యాసం చేస్తున్నారు.

చికాగో ఇల్లోనిస్ విపిల్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్నాడు.  అక్బమర్ తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్ళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అమెరికా కౌంటీ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ కాల్పులకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. తమకు వీసాను ఇప్పించాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాష్ట్రా ఐటీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసినట్లు అక్బర్ సోదరుడు షఫీ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: