తెలంగాణ ప్రకటనతో ఇటీవల ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పరిస్థితి గందరగోళంలో పడింది. విభజన తథ్యం అంటున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్థ నియమావళితో నియమించాల్సిన ఉద్యోగాల భర్తీ ఇక హుష్ కాకి అన్న అభిప్రాయాలే ఎక్కువ వ్యక్థమవుతున్నాయి.

ఏపిపిఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో అధికారుల స్థాయి నుంచి అటెండర్ల స్థాయి వరకు ఉద్యోగాల భర్థీకి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వీటి భర్తీకి ఎపిపిఎస్సీ కి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇంతలో పంచాయతి ఎన్నికలకోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయాయి. అయితే ఎన్నికల కమీషన్ అనుమతితో కొన్ని ఉద్యోగాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసారు. టెట్ పరీక్ష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చరు.

అంతే కాదు డిఎస్సీ కూడా నిర్వహిస్థామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన ఉద్యోగాల భర్థీ చేపడతామని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెట్డిఎస్సీల నిర్వహణ జోలికి వెళ్లనేలేదుఇంతలో ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. అయినా ఉద్యోగాల భర్థీ ఊసెత్తడం లేదు ప్రభుత్వం.

అందుకే అనుమానం వచ్చిన ఏపిపిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలా.. వద్దా.. అంటూ లేటెస్టుగా ప్రభుత్వానికి లేఖరాసింది. ఇదివరకే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికి ఏపిపిఎస్సీ మళ్లీ అనుమతి కోసం లేఖ రాయడంతో ఉద్యోగాల భర్తీ పై నీలినీడలు కమ్ముకున్నట్టే అంటున్నారు. కారణం ఇప్పుడున్న ఉద్యోగుల విషయంలోనే ప్రాంతాల వారి సందిగ్దత నెలకొనడంతో వీటిని నిలిపివేస్థారనే వాదనే ఎక్కువ వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: