ఈ మద్య తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు జరుగుతున్నాయి.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చేర్పులు జరిగాయి.  తమిళనాడు సీఎం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి అక్రమాస్తు కేసులో జైలు పాలైంది అమ్మె నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ.  అయితే ఆమెకు నమ్మిన బంటుగా ఉన్న పళని స్వామికి సీఎం పదవి వరించింది.  అయితే ఇప్పుడు వీరిద్దరు బద్ద విరోదులు అయ్యారు.  మరోవైపు చిన్నమ్మకు వ్యతిరేకంగా ఉన్న పన్నీరు సెల్వం..సీఎం పళని స్వామి దోస్తీ కట్టారు. 
Image result for sasikala panneerselvam
మరోపక్క విశ్వనటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గా ప్రకటించడమే కాకుండా కొత్త పార్టీ పెడతానని అన్నారు.   తాజాగా మరో నటుడు విశాల్ కూడా రాజకీయ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆర్కేనగర్ లో జరిగే ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.  కానీ కొన్ని నాటకీయ పరిణామల మద్య తిరస్కరణకు గురై విశాల్ ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు.
Image result for palani swamy pannir selvam
అనంతరం తేరుకుని తాను తమిళనాడు ప్రజలకు సేవ చేసేందుకే పోటీ చేద్దామనుకున్నానని.. ఇకపై తాను సేవ చేస్తానని ప్రకటించారు. తాజాగా విశాల్ కి మరో షాక్ తగిలింది.  ప్రస్తుతం నడిగర్ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ అయిన.. తమిళ్ నటుడు పొన్‌వన్నన్ రాజీనామా చేశారు.
Image result for vishal nomination
వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్టు పొన్‌వన్నన్ వెల్లడించారు. ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆయన చాలా కీలకమైన వ్యక్తి కావడంతో.. పొన్‌‌వన్నన్ రాజీనామాతో విశాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: