ఈ మద్య భారత దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఎవరో కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి..ఎంతో మంది తమ ఇంటి పెద్దలను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు.  అయితే రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..వాహనదారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 

తాజాగా ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదిహన్ దగ్గర   ట్రక్కు -ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.  ఈ దుర్ఘటన జరగగా, కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

అయితే పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రాక్టర్‌లో ప్రయాణించే వారు స్థానిక దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: