పోలవరం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వినిపిస్తున్న మాట.అస్సలు పోలవరం ఎందుకు ఇలా తయారైంది, ఎవరిదీ ఈ పాపం. 2018 కల్లా పూర్తి చేసి జనాల్లోకి వెళ్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నాడు. నిజానికి తప్పు కేంద్రానిదా? రాష్ట్ర ప్రభుత్వానిదా? దీనికి సమాధానం లోతుగా విశ్లేషించినట్లుయితే అర్ధం అవుతుంది. కాంగ్రెస్ హయంలో పోలవరం ప్రాజెక్ట్ వయం 13,000 కోట్లు ఇప్పుడు దాని వ్యయం 50,000 కోట్లు పై మాటే. ఇంత వ్యయం ఎందుకు ఐయింది అంటే దానికి టిడిపి వారు చెబుతున్న సమాధానం ఇది కాంగ్రెస్ వారు చేసిన అన్యాయం అని చెబుతున్నారు. మరియు కేంద్రం సహకరించడం లేదు అంటారు. వైస్సార్సిపీ వారెమే చంద్ర బాబు తీసుకున్న కమిషన్ల వల్లన అని చెబుతున్నారు. ఇందులో ఏది నిజం? అస్సలు జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ కేంద్రం నిర్మించాలి. రాష్ట్రప్రభుత్వం

 Image result for CHANDRA BABU POLAVARAM

ఎందుకు నిర్మిస్తున్నట్లు  దానికి టిడిపి వారు చెబుతున్నది, చంద్రబాబునాయుడు గారి సమర్ధత చూసి కేంద్రమే రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది అంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఐయితే రాష్ట్రప్రభుత్వం అర్ధంతరంగా ట్రాన్స్రాయ్ ను  తప్పిచండి. దానికి పోలవరం కట్టే సమర్ధత లేదని వాదిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న మీ మదిని తొలిచి వేస్తుంటుంది అస్సలు పోలవరం కట్టే సామర్ధ్యం ట్రాన్స్రాయ్ కంపెనీ కి లేనప్పుడు

 Image result for POLAVARAM

దానికి ఎందుకు అప్పగించినట్లు.ఈ విషయాన్నీ గమనించినట్లుయితే, తెలుగు దేశం కమిషన్లుకు కక్కుర్తి పడిందని చెప్పొచు.పైగా పట్టిసీమ ప్రాజెక్ట్ లో 300 కోట్లు పైగా కమిషన్లు చేతులు మారినట్లు కాగ్ నివేదిక తెల్చిపారేసింది.

 Image result for TDP & BJP

మరియు ట్రాన్స్రాయ్ అనేది ఒక టిడిపి ఎంపి కి సంభిందిచిన కంపెని  అని బిజెపి వారు కూడా విమర్శిస్తున్నారు. ఇంత వరకు పోలవరం ప్రాజెక్ట్ టోటల్ వ్యయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజు రోజుకు వ్యయం పెరుగుతుంది అని టిడిపి వారు ఆరోపిస్తిన్నారు. అది ఎలా సాద్యంఅవుతుంది. అస్సలు పోలవరం ప్రాజెక్ట్ కేంద్రానికి విదిలి వేసుంటే కేంద్రమే కట్టి ఉండేదని అందరి అభిప్రాయం. ఇవన్ని పరిగిణలోకి తిసుకున్నట్లుయితే రాష్ట్రప్రభుత్వమే ముద్దాయిగా తేలుతుంది. టిడిపి తమ స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్రభవిష్యత్తుని తాకట్టుపెట్టే పరిస్థితి కి వచ్చింది అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: