గత సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలను ఆలోపింపచేస్తూ..అమెరికాకు కొరకరాని కొయ్యగా మారారు ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్‌.  వీలు చిక్కినప్పుడల్లా అమెరికా, జపాన్ లపై విరుచుకు పడుతూ..పదే పదే క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నారు కిమ్ జోంగ్.   తాజాగా తమ అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అతీంద్రయ శక్తులున్నాయని వారి అధికారిక మీడియా ప్రచారం చేసుకుంటోంది.  గతవారం 9 వేల అడుగుల ఎత్తైన పెక్తూ మంచు పర్వతాన్ని కిమ్ జోంగ్ అధిరోహించాడు.
Image result for kim jong
అయితే వాతావరణాన్ని కూడా నియంత్రించే శక్తి ఉందని అధికార పత్రిక రొడాంగ్ సిన్మన్ పేర్కొంది. ఆయన కురవమన్నప్పుడే వర్షం కురుస్తుంది... ఆయన ఉదయించమంటేనే సూర్యుడు ఉదయిస్తాడని కథనం ప్రచురించింది.  కాగా గత కొన్ని రోజులు గా కిమ్ జోంగ్ పై ఎన్నో కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.  రొడాంగ్ సిన్మన్ ఓ కథనాన్ని ప్రచురిస్తూ... అత్యంత క్లిష్టమైన ఈ మంచు పర్వతాన్ని తమ అధినేత అధిరోహించినా, ఏ మాత్రం అలసట లేకుండా ఉన్నారంటే దాని వెనుక ఆయనకున్న అతీంద్రియ శక్తులే కారణమని వ్యాఖ్యానించింది.
Image result for kim jong
అంతే కాదు 9 వేల అడుగుల ఎత్తైన ఈ పర్వతాన్ని అధిరోహించడం అంటే సామాన్యుల వల్ల కాదని అన్నారు. . ప్రకృతి నియంత్రణా శక్తే, పర్వతాన్ని సులువుగా అధిరోహించేందుకు కారణమైందని ఉత్తర కొరియా వాసులు సైతం బలంగా నమ్ముతున్నారు.   రహస్య మిలటరీ స్థావరంలో కిమ్ జన్మించినప్పుడు ఆకాశంలో రెండు హరివిల్లులు కనిపించాయని ఆయన తండ్రి కిమ్ జోంగ్ 2 తన స్వీయ చరిత్రలో వెల్లడించారు.
Image result for kim jong
మూడేళ్ల వయసులోనే కారును నడిపినట్లు, తొమ్మిదేళ్లప్పుడు ఈతగాడిగా పోటీపడ్డారని అందులో రాశారు. ఉత్తర కొరియా నవంబరు 29 న హస్వాంగ్ -15 రకం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించి మరోసారి దుందుడుకు వైఖరి ప్రదర్శించింది. ఈ క్షిపణి 15 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేరుకోగలదని, ఇప్పుడు అమెరికా మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చిందని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: