ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించారు.  అయితే పార్టీ తరుపు నుంచి మాత్రం పోటీ చేయలేదు..ఆ సమయంలో టిడిపి, బిజెపి లకు పూర్తి సహకారాలు అందించి ఆ పార్టీల తరుపు నుంచి ప్రచారం కూడా చేశారు.  అప్పటి నుంచి పవన్ కళ్యాన్ టీడిపి, బిజెపి లకు మంచి దోస్తీ కుదిరిందని వార్తలు వచ్చాయి.  కానీ ఈ మద్య దానికి పూర్తి విరుద్దంగా అధికార పక్షాన్ని ఎండగడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు పవన్ కళ్యాన్. 
Image result for pawan kalyan ashok gajapathi raju
ఒక రకంగా చెప్పాలంటే..ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల మధ్య నాటకీయ, వ్యంగ్య వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత నాలుగు రోజల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఏపిలో పర్యటిస్తూ అధికార ప్రతిపక్షపార్టీలపై విమర్శలు గుప్పిస్తుండటంతో వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు.  ఈ మద్య పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లపై కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు స్పందిస్తూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో నాకు తెలియదు, అత‌ను సినిమా న‌టుడని విన్నాను అని వ్యాఖ్యానించడపై పవన్ కళ్యాన్ పంచ్ లు విసిరారు.
Image result for pawan kalyan ashok gajapathi raju
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై జనసేనాని స్పందిస్తూ.. అశోక్‌ గజపతి రాజుగారికి పవన్‌ కల్యాణ్‌ ఎవరో తెలియదు.. సంతోషం' అని పవన్ ట్వీట్‌ చేసి కౌంటర్ ఇచ్చారు. కాగా, ఈ మద్య పవన్ కళ్యాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ఏపిలో టిడిపి ఓడించే శక్తి తనకు ఉందని వ్యాఖ్యానించారు.  దీనిపై కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు స్పందిస్తూ.. టీడీపీని ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదంటారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు.
Image result for pawan kalyan ashok gajapathi raju
తాను ఎనిమిదిసార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే..ఏడు సార్లు విజయం సాధించానని గెలుపు ఓటములు మన చేతుల్లో ఉండవని ఎవరు ఉండాలో ఎవరు వెళ్లాలో ప్రజలే నిర్ణయిస్తారని కౌంటర్ వేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: