సాధరణంగా సౌదీలో మహిళలపై చాలా వరకు ఆంక్షలు ఉంటాయని వింటుంటాం..  ఈ మద్య మహిళలపై ఒక్కొక్క ఆంక్షలు సడలిస్తుంది సౌదీ ప్రభుత్వం.  తాజాగా సినిమా థియేటర్లపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. థియేటర్ల నిర్మాణానికి తక్షణమే లైసెన్సులు ఇస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికి హాళ్లు ప్రారంభమవుతాయని ఆ దేశ సమాచార శాఖ మంత్రి అవ్వాద్‌ తెలిపారు. మూడున్నర దశాబ్దాల క్రితం సినిమాలపై విధించిన నిషేధాన్ని సోమవారం ఆయన ఎత్తివేశారు. 
Image result for after 35-year ban
వచ్చే ఏడాది నుంచి సినిమా థియేటర్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘గత 35 ఏళ్లుగా ఉన్న నిషేధం తొలగడంతో తొలిసారిగా 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది.  సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం, నైతిక విలువల్ని క్షీణింపజేస్తాయన్న నాటి పెద్దల హెచ్చరికలతో 1980లో వాటిని మూసివేశారు. 
మూడున్నర దశాబ్దాల సినిమాలపై నిషేధం తొలిగింపు
దీనిపై సౌదీ చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న సినీ పరిశ్రమకు సర్కారు నిర్ణయం మరింత ఊపునిస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలోని కోబార్‌లో ఒక థియేటర్‌ మాత్రమే నడుస్తోంది. అందులో కూడా పరిశోధనాత్మక డాక్యుమెంటరీలు వంటివి మాత్రమే ప్రదర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: