నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను అంటే పార్లమెంట్ అసెంబ్లి ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారించేందు కు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి సుముఖంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలియజేసింది. దానికి 2014 తర్వాత 13,500 కేసుల్లో నిందితులుగా ఉన్న దేశంలోని 1581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను సత్వరమే విచారించడానికి ఈ ప్రత్యేక కోర్టులకు కొంత గడువు ఇస్తే వారిపై ఉన్న కేసుల సమాచారం సేకరించి విచారణను వేగవంతం చేస్తామని మంగళ వారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. 

supreme court & jagan కోసం చిత్ర ఫలితం

ఈ కోర్టుల నియామకానికి కేంద్రం రూ.7.80 కోట్లు కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధుల వివరాలను సేకరించిన సుప్రీంకోర్టు, విచారణంలో జాప్యాన్ని నివారించేందుకు కొన్ని ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలని సూచించింది. కోర్టులు ఏర్పాటు చేయటం మొదలై కేసుల అలాట్మెంట్ జరగటం మొదలైతే అసలు ప్రత్యేక కోర్టులు ఎన్ని అవసరం అవుతాయనే విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుందని తెలుస్తుంది. 

central election commission కోసం చిత్ర ఫలితం

కేసులతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులను సత్వరమే విచారించి, చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2015లో దీనిపై కేంద్రం వైఖరి ని తెలియజేయాలని తెలిపిన సుప్రీం కోర్ట్ గత నవంబరు లో మరోసారి కేంద్రానికి గుర్తుచేసింది. దేశంలో ఉన్న 17వేల సబార్డినేట్ కోర్టుల్లో సగటున 4,200 కేసులున్నాయని, రాజకీయ నేరస్థుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాల్సిన అవశ్యకత ఉందని జస్టిస్ రంజన్ గగోయ్, నవీన్ సిన్హాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఏ నేతైనా నేరాలకు పాల్పడినట్లు ఋజువైతే వారిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని కూడా గతనెలలో "కేంద్ర ఎన్నికల సంఘం" పేర్కొంది.

12 special courts chandrababu & jagan కోసం చిత్ర ఫలితం

అంతేకాదు రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోవడం కోసం ప్రత్యేకచట్టం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని విచారణ సందర్భంగా కోర్టును ఎన్నికల సంఘం కోరగా ప్రతిపాదనలపై సుప్రీం స్పందిస్తూ, దీనికి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నా రని ప్రశ్నించింది. అంతేకాదు ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉన్నారని, దీన్నే మీరు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా అని నిలదీసింది. 

cash for vote scam కోసం చిత్ర ఫలితం

సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం వివరణఇస్తూ, నేరాలకు పాల్పడినవారిపై ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాల నిషేధించాలని కేంద్రానికి సిఫార్సు చేశామని న్యాయవాదు లు మీనాక్షి అరోరా, మోహిత్ రామ్‌లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆరేళ్లను జీవితకాలంగా మార్చాలని సూచించినట్లు తెలిపారు. కానీ దీనిపై నిర్ణయం తీసు కోలేదని వెల్లడించారు.

cash for vote scam కోసం చిత్ర ఫలితం

దీంతో ఇప్పటికే అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వైసిపి అధినేత జగన్ మోహన రెడ్డి అలాగే ఓటుకు నోటు కేసులో బుక్కైన చంద్ర బాబు నాయుని కి రాజకీయంగా రోజులు ముగిసినట్లేనా? అంటున్నారు ప్రజలు. 

12 special courts chandrababu & jagan కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: