హైదరాబాదే అందరి రాజధాని అని అలా కాకపోతే తాను పార్టీకి పదవికి రాజీనామా చేస్థానని చిరంజీవి ప్రకటించారు. కేసిఆర్ అలా మాట్లాడడం తప్పన్నారు. కాంగ్రేస్ తెలంగాణ ఇవ్వడంతో రాజకీయ నిరుద్యోగిగా మారుతున్నానన్న భయంతో అలా మాట్లాడాడని చిరంజీవి చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రేస్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది అనడం తప్పని, అది అంత ఆషామాషి నిర్ణయం కాదని చిరంజీవి తెలిపారు. హైదరాబాద్ తో సీమాంధ్రులెందరికో అవినాభావ సంబందాలు, విడదీయలేని అనుబంధాలు ఉన్నాయని తెలిపారు. అందుకే హైదరాబాద్ సీమాంధ్రకు పదేళ్ల పాటు కాదని శాశ్వత రాజధానిగా ఉండేందుకు తాను పోరాడుతానని చెప్పారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ ఆంబేద్కర్ లాంటి వారే దేశానికి రెండో రాజధాని అవసరం, అది కూడా హైదరాబాదే ఉండాలని అన్నారంటే హైదరాబాద్ ఎంత ప్రముఖమైనదో అర్థం అవుతోందని చిరంజీవి చెప్పారు. దేశానికి రెండో రాజధానిగా, సీమాంధ్ర, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగానే హైదరాబాద్ ఉంటుందని తెలిపారు. లేదంటే తాను రాజీనామాకు సిద్దమని చెప్పి ఇప్పుడిప్పుడే రాజకీయ ట్రాక్ పైకి వచ్చే ప్రయత్నం చేసారు చిరంజీవి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: