పోలవరం ప్రాజెక్టు విషయమై అధికార రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించిందని కేంద్ర నీటిపారుదలమంత్రి నితిన్ గడ్కారీ మరోసారి నిరూపించారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు విషయమై రెండు పార్టీల మధ్య జరిగిన విమర్శల వెల్లువ నేపథ్యంలో ఆయన సర్దుబాటు వ్యాఖ్యలు చేశారు, గానీ  ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా అన్నారు.

రాష్ట్రనికి  పోలవరం విషయంలో ఇవ్వాల్సిన బిల్లులని ఇచ్చేసామని చెబుతున్నారు, కానీ రాష్ట్ర  ప్రభుత్వం లెక్కల ప్రకారం మూడు వేల కోట్ల కు రావాల్సి ఉంది. మరోవైపు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తామని రెండు ప్రభుత్వాలు కలిసి 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.

ఈనెల 22న నితిన్ గడ్కారీ పోలవరం పనులు స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ప్రకటించారు. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే కేంద్రమంత్రి గడ్కారీ పర్యవేక్షణలో ఆ శాఖ నివేదికలు 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని నిబంధన ఎక్కడా లేదు.

వారి నివేదికల్లో ఇతర జాతీయ ప్రాజెక్టులకు కొన్ని తేదీలు ఇచ్చారు గాని పోలవరంకు వచ్చే సరికి ఎలాటి గడువు లేదని స్పష్టంగా రాశారు.రాబోయే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ 2018, 2019 అనొచ్చు గాని అన్నీ తెలిసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కూడా  ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మళ్లీ ఆయనే ఎందుకు నిధులు రావలసివుందనే వాస్తవాన్ని నిరాకరిస్తున్నారు? 


మరింత సమాచారం తెలుసుకోండి: