పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పిల్ల తెలుగుదేశం పార్టీ అనీ, మరియు చంద్రబాబు భజనసేన అని ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ ఆరోపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ ని ఎక్కడా తక్కువ అంచనా వేయడం లేదు. పవన్ కళ్యాణ్ ఈమధ్య పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్ళాడు, ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖండించడమే దీనికి నిదర్శనం.

పవన్ కళ్యాణ్  ఆలోచన ఏంటనేది తెలిసేంతవరకు జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా లో వస్తున్న కథనాలను బట్టి ఈ విషయం అర్థమవుతుంది. ఇటీవల పర్యటించిన పవన్ కళ్యాణ్ తన అన్న అయిన  చిరంజీవి గురించి కూడా ఇప్పుడు చాలా మంది  గౌరవంగా మాట్లాడారు.

దీన్ని బేస్ చేసుకుని టీడీపీ అనుకూల పత్రిక  దీని మీద కథనం రాసింది. ఆ కథనం ఏమిటంటే జనసేన పార్టీ లో చిరంజీవి కి  పెద్ద పదవి ఇస్తారని రాసింది. అలాగే అధ్యక్ష పదవి ఇస్తానని కూడా రాసుకొచ్చింది. అయితే రాజకీయ మేధావులు మాత్రం ఇలాంటి జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలాంటి కథనాలు విడుదల చేయడం ద్వారా లేనిపోని వూహలకు అవకాశమిచ్చి, తద్వారా పవన్‌ పెరుగుదలను మొదటే అడ్డుకోవాలన్న ఆలోచన వుందని ఆయన సపోర్తర్ లు  విమర్శిస్తున్నారు.

ఒకసారి చిరంజీవి పవన్ కళ్యాణ్ కి సలహా ఇస్తూ రాజకీయాల కోసం సినిమాలు పూర్తిగా మానుకోవడం మంచిది కాదని అన్నారు. అలాంటి చిరంజీవి రాజకీయాలు కు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు, ఇటువంటి సందర్భంలో సినిమాలని వదిలి చిరు తిరిగి రాజకీయాల్లోకి వస్తారంటే వినడానికే హాస్యాస్పదంగా ఉంది. జనసేనను పలచబర్చడం, సామాజికంగా ఒక వర్గాన్ని గందరగోళపర్చడం లక్ష్యాలుగా ఇవన్నీ ప్రచారం చేస్తున్నారనేది జనసేన వర్గాల స్పందనగా వుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: