రేషన్ షాపులు.. గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు అందించే షాపులుగానే చాలామందికి తెలుసు.. ఓ మాదిరి ఆదాయం ఉన్నవారు అయితే కనీసం ఈ షాపులకేసు కన్నెత్తి చూడరు.అందువల్ల ఈ రేషన్ షాపులు నడిపించేవారికి కూడా ఆదాయం అరకొరగా మారింది. దీంతో వారు ఆదాయం కోసం పక్కదారులు వెతకడం కామన్ అయ్యింది. కానీ ఇప్పుడు వీటి దశ మారిపోతోంది.

Image result for ‘చంద్రన్న విలేజ్ మాల్’

రేషన్ షాపు డీలరుకు అధిక ఆదాయం, వినియోగదారులకు సరసమైన ధరలకే వస్తువులు లభించేలా చంద్రబాబు సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రేషన్ షాపులను ఆధునీకరించి చంద్రన్న విలేజ్ మాల్’ రూపంలో తీసుకొస్తోంది. రేషన్ షాపు డీలర్లు, వినియోగదారులకు ఈ విలేజ్ మాల్స్ ను న్యూ ఇయర్ గిఫ్ట్ గా అందిస్తోంది. విజయవాడ, గుంటూరులో దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. ఈ ‘చంద్రన్న విలేజ్ మాల్’ను సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు.

Image result for ‘చంద్రన్న విలేజ్ మాల్’

రాష్ట్రంలో మొత్తం 28 వేలకు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఫేజ్ కింద 6500 రేషన్ షాపులను విలేజ్ మాల్స్ గా తీర్చిదిద్దుతారు. పేదవారికి నాణ్యమైన వస్తువులను,అత్యంత చౌకల ధరలకు అందించాలన్నది ఈ విలేజ్ మాల్స్ లక్ష్యం. ఒకవేళ పేదలైనా సరే బియ్యం వద్దనుకుంటే అంతే విలువైన ఇతర వస్తువులు ఈ మాల్స్ నుంచి తీసుకెళ్ల వచ్చు.ఇప్పటివరకూ నిత్యావసరాలకే పరిమితమైన ఈ షాపులు ఇక అన్నిరకాల వస్తువులు అందిస్తాయి.

Image result for ‘చంద్రన్న విలేజ్ మాల్’

ఈ చంద్రన్న విలేజ్ మాల్స్ ద్వారా వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్‌పీ కన్నా 4% నుంచి 35% తక్కువ ధరకు లభిస్తాయి. వస్తువులపై వివిధ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్‌లో 40 శాతం డీలర్‌కు 60 శాతం వినియోగదారులకు దక్కుతుంది. ‘చంద్రన్న విలేజ్ మాల్’ నవీకరణకు అయ్యే పెట్టుబడి వ్యయాన్ని ‘పీఎం ముద్ర యోజన’ పథకం ద్వారా రేషన్ షాపు డీలర్లకు రుణ సదుపాయం కల్పిస్తారు. డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను ఈ మాల్‌లో అందుబాటులోకి తెస్తారు. బందరు లడ్డు, కాకినాడ కాజా, పచ్చళ్లు ఇలా తెలుగింటి రుచులు అన్నింటినీ విక్రయించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: