2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయాలలో హీట్ పుట్టిస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ హోరాహోరిగా పోటి పడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రం బిజెపికి కంచు కోట లాంటిది. ఇంతవరకు జరిగిన అన్ని అన్ని శాసనసభ ఎన్నికల్లో బిజెపి విజయడంకా మోగించింది. స్వయాన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి గుజరాత్ ను సుదీర్ఘంగా పరిపాలించాడు మరియు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కు కూడా గుజరాత్ స్వంత గడ్డ.

 Image result for congress

ఇన్ని పాజిటివ్స్ మరియు ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న బిజెపి కి విజయం నల్లేరు మీద నడక అవ్వాలి. కాని  పరిస్థితిని చూస్తుంటే అలా అనిపించడం లేదు. కాంగ్రెస్ హోరాహోరిగా  గట్టి పోటీని ఇస్తుంది. దీనికి కారణాలు లేకపోలేదు.ఈ మద్య బిజెపి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు. నోట్ల రద్దు మరియు జి యస్ టి గుజరాత్ వ్యాపారుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపింది. చాల మంది గుజరాత్ వ్యాపారులు బి జె పి మీద ఆగ్రహంగా ఉన్నారు అని తెలుస్తుంది.

 Image result for modi

ఎలెక్షన్స్ అనగా ఎదో ఒక పార్టీ గెలుస్తుంది. ఎదో ఒకటి ఓడుతుంది అది సర్వసాధారణం ఐయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది దేశ ప్రధాని మంత్రి  చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ వారు నన్ను చంపించడానికి పాకిస్తాన్ హై కమిషన్ కు సుఫారి పంపింది అని వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక దేశ ప్రధానమంత్రి అయ్యి ఉండి, ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం  అందరిని  నిస్టేతులును చేసింది. నన్ను చంపించడానికి మన్మోహన్ సింగ్ మరియు మని శంకర్ ఐయ్యర్ భేటి అయ్యారని నరేంద్ర మోడీ చెబుతున్న మాటలు. వారిద్దరూ భేటి అయ్యినంత మాత్రాన అటువంటి నిరాధారణ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం. ప్రధాన మంత్రి స్థాయిని మరిచి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలు హర్షించడం లేదు. నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేడానికి కారణాలు లేకపోలేదు. గుజరాత్ ఎన్నికల్లో గెలవడం అంత తేలికైన పని కాదని నరేంద్ర మోడీ కి అర్ధం అయ్యింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే  తన ప్రతిష్టతకు ముప్పు అని బావించాడు. పైగా రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని అని అతనకు తెలుసు. అందుకే ఆతనూ ఈ వ్యాఖ్యలు చేసాడు అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి.

 Image result for modi

అస్సలు ఒక దేశానికి సంభందిచిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వేరొక దేశాన్ని లాగడం ఎంత వరకు సమంజసం. పైగా ఇది వేరొక దేశం తో ఉన్నసంభందాలను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఎన్నికలు అన్నాగ విమర్శలు చేసుకోవడం సహజం అది ఒక లిమిట్ వరకు కాని ఈ విధంగా విమర్శలు చేయడం నరేంద్ర మోడీ కి లాభం చేయకపోగా, నష్టం చేకూరే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: