ఎంతటి మహా వృక్షమైనా ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. అలాగే అనితర సాధ్యమైన విజయం సొంతం చేసుకొని అధి కారం లోకి వచ్చిన అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పరిపాలనకు ప్రజల్లో వ్యతిరేఖత ప్రారంభమైనది. దానికి నాందీ ప్రస్థావనే అలబామా అపజయం అని చెప్పవచ్చు.  

doug jones roy moore poll with Trump కోసం చిత్ర ఫలితం

 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి 'డౌగ్‌ జోన్స్‌'  విజయం సాధించారు. గత 25 ఏళ్లుగా అధికార రిపబ్లికన్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న అలబామాలో డెమొక్రాట్లు విజయం సాధించడం ఇదే తొలిసారి. డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుతో బరిలోకి దిగిన రిపబ్లికన్‌ అభ్యర్థి 'రాయ్‌ మూర్‌' ను ఓడించి, డౌగ్‌ జోన్స్‌ విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి రాయ్‌ మూర్‌ ససేమిరా అంటుండటం గమనార్హం.

doug jones roy moore poll with Trump కోసం చిత్ర ఫలితం

అమెరికా సాంప్రదాయవాద ఓటర్లు అధికంగా ఉన్న అలబామాలో గత 25ఏళ్ల లో ఒక డెమొక్రాట్‌ అభ్యర్థివిజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడ ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు తో బరిలోకి దిగిన రాయ్‌ మూర్‌ కు వ్యతిరేకంగా లైంగికవేధింపులు ఆరోపణలు వెలుగుచూడటం, బాలికలపై ఆయన లైంగికవేధింపులు పాల్పడ్డట్టు కథనాలు రావడం రిపబ్లికన్లను కుదిపేసింది. ఈ క్రమంలో ఉదారవాద డెమొక్రాట్లకు బ్లాక్‌ ఓటర్ల అండ లభించడంతో డౌగ్‌ జోన్స్‌ విజయం సాధించినట్టు భావిస్తున్నారు.

us senate కోసం చిత్ర ఫలితం

అలబామాలో డెమొక్రాట్‌ విజయం, డొనాల్డ్‌ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ విజయం తో అమెరికా సెనెట్‌ పెద్దలసభ (అప్పర్‌ చాంబర్‌) లో రిపబ్లికన్‌ పార్టీ మెజారిటీ 51-49 కి తగ్గిపోయింది. వచ్చే ఎడాది జరగనున్న కాంగ్రెషనల్‌ ఎన్నికల్లో పెద్దలసభలో రిపబ్లికన్లు మెజారిటీ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే, అధ్యక్షుడు ట్రంప్‌ అజెండా అమలుకు సెనెట్‌ ఆమోదం లభించడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: