సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాను దోషిగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ కుంభకోణంలో మధు కొడా అవినీతికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది.  మధుకోడా సహా బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, ఝార్ఖండ్‌ మాజీ సీఎస్‌ అశోక్‌కుమార్‌ బసు, మరో వ్యక్తి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు వెల్లడించి వీరిని దోషులుగా నిర్థారణ చేసింది. \
Image result for india coal scam
2007సంవత్సరంలో ఝార్ఖండ్‌లోని రాజ్‌హరా పట్టణంలో ఒక కంపెనీకి అక్రమంగా బొగ్గుగనులు కేటాయించినట్లు వీరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేటాయింపులో మధుకొడా, మరికొందరు ప్రభుత్వ అధికారులు ఆ కంపెనీకి అనుకూలంగా అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.
Image result for india coal scam
కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్(విసుల్)కు జార్ఖండ్‌లోని రాజ్హరా బొగ్గు బ్లాక్ కేటాయించడానికి కోడా సహా మిగతా నిందితులు కలిసే కుట్రచేశారని సీబీఐ ప్రత్యక న్యాయస్థానం జడ్జి భరత్ పరాశర్ చెప్పారు. 
Related image
విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు మధుకొడా సహా మరో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పును తెలిపింది. దోషులందరికీ గురువారం శిక్షకు ఖరారు చేయనుంది. దీంతో సుప్రీంను ఆశ్రయించనున్నారు మధు కొడా.


మరింత సమాచారం తెలుసుకోండి: