ఎస్.ఎస్. రాజమౌళి.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. తెలుగు సినిమా రేంజ్ ను అకస్మాత్తుగా ఆకాశానికి ఎత్తేసిన వాడు.. ఒక తెలుగుసినిమా వేలకోట్ల రూపాయల బిజినెస్ చేయగలదని నిరూపించినవాడు.. మిగిలినవారు కనీసం ఊహించడానికి కూడా భయపడే రికార్డులు అలవోకగా సాధించినవాడు.. చిత్ర సీమలో ఇంతవరకూ పరాజయం పలకరించని దర్శకధీరుడు.. ఇదీ రాజమౌళి ట్రాక్ రికార్డ్. 

Image result for amaravathi

టాలెంట్ ఎక్కడున్నా పట్టుకోవడం.. దాన్ని తన అవసరాలకు ఉపయోగపడేవిధంగా వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. అందుకే అమరావతి భవనాల డిజైన్ల విషయంలో రాజమౌళి టాలెంట్ ను సీఎం చంద్రబాబు వాడుకోవాలనుకున్నారు. ఇప్పటికే రాజమౌళి బాహుబలి సినిమా ద్వారా మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆవిష్కరించన తీరు ఆయన్ను ఆకట్టుకుంది. అమరావతి నిర్మాణంలో రాజమౌళి టాలెంట్ కూడా తోడైతే మరింత వన్నె పెరుగుతుందని చంద్రబాబు భావించారు. 

Image result for chandrababu naidu rajamouli

అమరావతి భవనాల డిజైన్ల రూపకల్పనలో రాజమౌళికీ భాగస్వామ్యం కల్పించారు. రాజమౌళి ఈ విషయంలో లండన్ కూడా వెళ్లి వచ్చారు. నార్మన్ ఫోస్టర్స్ డిజైన్లు పరిశీలించారు. కొన్నిసూచనలు చేశారు. చివరకు రాజమౌళి కూడా ఓ డిజైన్ కు మెరుగులుదిద్దారు. తాజాగా ఆయన తన డిజైన్ ను నార్మన్ ఫోస్టర్స్ బృందం సమక్షంలో చంద్రబాబు చూపించారు. రాజమౌళి డిజైన్ కాబట్టి ఓకే అయిపోతుందని అంతా అనుకున్నారు. 

Image result for baahubali settings

కానీ.. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడబోనని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ విషయం స్వయంగా రాజమౌళియే చెప్పారు. రాజధానిలో అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్ కోసం పని చెయ్యమని సీఎం చెప్పారని.. ఒక డిజైన్ ఓకే అయిందని ఆయన వివరించారు. కానీ తనను కూడా కొన్ని మార్పులు చేయమన్నారని రాజమౌళి తెలిపారు. తాను వర్క్ చేసిన డిజైన్ ఓకే కాలేదని..దాన్ని మీడియా సిటీకి వాడుకుంటామని సీఎం చెప్పారని రాజమౌళియే చెప్పారు. అదీ సంగతి. 
Image result for baahubali settings


మరింత సమాచారం తెలుసుకోండి: