తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ..ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం.   హైదరాబాద్‌లో నేటి నుంచి ‘తెలుగు’ పండుగ ప్రారంభం కానుంది. ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్యనగరం ముస్తాబైంది. నేటి నుంచి ఈనెల 19 వరకు ఐదు రోజులపాటు తెలుగు సభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.తెలుగు భాష ఘనతను చాటడం ఒక ఎత్తయితే.. తెలంగాణ యాసకు పట్టాభిషేకం చేయడం ప్రధానంగా మహాసభలను వైభవంగా నిర్వహిస్తోంది.
Image result for తెలుగు మహాసభలు
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారిని ఆహ్వానించింది. సాయంత్రం ఐదు గంటలకు అధికారికంగా సభలు ప్రారంభం కానున్నాయి. సభల ప్రారంభం, ముగింపు వేడుకలకు ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. గవర్నర్లు నరసింహన్, విద్యాసాగర్ రావులు విశిష్ట అతిథులుగా రానున్నారు.
Image result for తెలుగు మహాసభలు
తొలి తెలుగు మహాసభలు జరిగిన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ క్రీడా ప్రాంగణమే ఈసారి వేడుకలకు ప్రధాన వేదికగా ముస్తాబైంది. ప్రధాన వేదిక లాల్‌బహదూర్‌ క్రీడా ప్రాంగణంతోపాటు రవీంద్రభారతి ప్రధాన మందిరం, మినీ మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం సభా మందిరం, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తులలో తెలుగు భాషా వైభవం చాటి చెప్పే విధంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: