ఆ కోర్టులో 1994 నుండి కేసులు ఎందుకు పెండింగ్ లో  ఉన్నాయి? అక్కడ కేసుల విచారణలు అసలు జరుగుతుందా? ఆశ్చర్యం గొలిపే ప్రశ్నతో సర్వోన్నత న్యాయస్థానం డిల్లీ హైకోట్ రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జె) ను ఉద్దేసించి కాస్త ఘట్టిగానే ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టులో దశాబ్ధాలుగా అనేక కేసులు పెండింగ్‌ ఉండటం, ఆ పై సుప్రీం కోర్ట్ ప్రశ్న కు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ సుప్రీం కోర్టులో సమాధానం చెప్పలేక తాను "నర్వస్ ఫీల్ అవుతున్నానని" అనటం విచిత్రంగా ఉంది. 

supreme court కోసం చిత్ర ఫలితం

సుప్రీం కోర్ట్ ప్రశ్నలు పరంపరగా సందించడంతో 'ఐయామ్‌ వెరీ నెర్వస్‌ మై లార్డ్‌' అంటూ మరో ప్రశ్న వేయకుండా ఆయన సమాధానం చెప్పారు. వీలయినంత త్వరగా కేసులు విచారణకు వచ్చేలా చూస్తానని అన్నారు. పెద్ద ఎత్తున కేసులు పెండింగ్ లో పడి పేరుకుపోవడం, కేసులు విచారణ ఆలస్యం జరుగుతుండటంపై 'ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌'  ని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ధర్మాసనం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. జస్టిస్‌ గొగోయ్‌ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి ఆర్జీ కంగారు పడిపోయారు. న్యాయమూర్తి అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు.

సంబంధిత చిత్రం

గత పదేళ్లుగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అడిగినా ఆయన నామమాత్రం కూడా సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసలు మీరు కోర్టుకు ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ఏ కేసు విచారణ జరుగుతుందనే విషయం అయినా తెలుసా? 1994 నుంచి కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో? అనే విషయం కూడా మీకు తెలియదు. మీకు కనీసం ఆ విషయం అయినా తెలుసుండాలి ? అని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రశ్నించారు. ఈ ప్రశ్నల ధాటికి కంగుతిన్న ఆర్జె కంగారుగా  "అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐయామ్‌ వెరీ నెర్వస్‌ మై లార్డ్‌. దయచేసి నాకు కొంచెం గడువు ఇవ్వండి" అని దీనంగా ప్రార్థించాడు. దీనికి బదులిచ్చిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌,  'అయితే సరే, మీకు కొంచెం గడువు ఇస్తున్నాను. ఆ సమయం లోగా నైనా మీ నెర్వస్‌ పోతుందేమో చూస్తాము" అని అన్నారు. 

registrar general of delhi high court కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: