ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏపి అభిృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు.  ముఖ్యంగా అమరావతి నిర్మాణం కోసం ఆయన అహర్శిశలూ కష్టపడుతున్నారు.  ఇక ఏపిలో పెట్టుబడులు ఎంతగా వస్తే..అంత అభివృద్ది చెందుతుందని మొదటి నుంచి సీఎం విదేశీ పర్యటనలు చేస్తూ పెట్టుబడులను ఆకర్శిస్తున్నారు.  

Image result for it minister lokesh

ఇక తండ్రి బాటలోనే నడుస్తున్నారు..  ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.  అమెరికా పర్యటనలో భాగంగా ఆయన  తొలిరోజే కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించిన లోకేశ్ బృందం... గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అధునాతన సాంకేతిక సాయం అందించేందుకు గూగుల్ ఎక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక సంస్థ నెలకొల్పడానికి అంగీకరించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్... గూగుల్ ఎక్స్ తో ఒప్పందం చేసుకున్నారు.

Image result for it minister lokesh

ఇంతవరకూ ఓకే.. కానీ ఈ ఒప్పందం ద్వారా ఏపీకి ఒకగూరే మేలు ఏంటి.. గూగుల్ ఎక్స్ రాష్ట్రానికి వస్తే ఏం జరుగుతుంది.. అన్న సందేహాలు రావచ్చు.. కానీ గూగుల్ ఎక్స్ రాక ద్వారా ఏపీ సాఫ్ట్ వేర్ కు మంచి బూమ్ లభిస్తుంది. గూగుల్ లాంటి సంస్థ రాక తర్వాత మిగిలిన దిగ్గజ కంపెనీలు కూడా ఏపీని తమ విస్తరణకు మొదటి ప్రయారిటీగా గురిస్తాయి.. సైబరాబాద్ కూడా ఇలా అభివృద్ధి చెందిన విషయాన్ని మనం మరచిపోకూడదు. అంతే కాదు.. గూగుల్ ఎక్స్ సంస్థ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తానని ఒప్పందం ద్వారా స్పష్టంగా చెబుతోంది.

Image result for it minister lokesh

గూగుల్ ఎక్స్ తో ఒప్పందం ద్వారా రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని మంత్రి నారా లోకేశ్ అంటున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారు ఏపీ ఫైబర్ గ్రిడ్ అనే సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంటింటికీ ఇంటర్ నెట్ ను అతి చౌకగా ఇవ్వాలన్నది దాని ఉద్దేశం. ఈ సంస్థ అభివృద్ధికి గూగుల్ ఎక్స్ సహకరిస్తుందట. ఫైబర్ గ్రిడ్ తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేస్తుందట.

Image result for it minister lokesh

ఇంతకీ ఈ ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ఏంటనుకుంటున్నారా.. వీటి ద్వారా ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ తో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ అందించవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ ఎక్స్ రాక తో కమ్యూనికేషన్ లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: