కేంద్రం తీరు సాధారణ ప్రజలని ఇక్కట్లకు గురిచేస్తున్నట్లే ఉంది. నరెంద్ర మోదీ ఏ సంస్కరణ మొదలెట్టినా తొలుత ఆ సమస్యల చిక్కుల్లో పడెవారు సామాన్యులు. పెద్ద నోట్ల రద్దు దెశానికి చేసిన మేలేమిటంటే ఆ సేతు శీతాచలం ప్రజలను దాదాపు మూడు నుండి నాలుగు నెలలు బాంకుల ముందు క్యూల్లో నిలబెట్టింది. ఉన్నతస్థాయి ప్రజలకు జరిగిన నష్టం ఏమీ లేదు. వారి దగ్గర ఎంత నల్ల ధనముందో మాత్రం తెలిసింది ప్రజలకు. బాజపా నాయకుడు గాలి జనార్ధనరెడ్డి తన కూతురి వివాహానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారనే వార్తలొచ్చాయి. అలాగే అరుణ్ జైట్లి, నితిన్ గడ్కరి సంతాన వివాహాలకు ఖర్చు చేసిన సొమ్ము నల్లధనం కాక మరేమిటి. ప్రజలు రోజువారి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక బాంకుల ముందు ఇబ్బందులు పడు తుంటే బాజపా నాయకులు విలాసాలు చేసుకోవటం ప్రజలు గుర్తించారు.
arun jaitly FRDI bill in English కోసం చిత్ర ఫలితం

జిఎస్టి ప్రజలకేమి చేస్తుందోగాని నేడు సామాన్యుడు ఇబ్బడి ముబ్బడైన జీవన వ్యయానికి జీవనానికి మధ్య నలిగిపోతున్నాడు. ఇప్పుడు ప్రజల ఆదాయాన్ని భద్ర పరచు కునే ఒకే ఒక్క నమ్మక వ్యవస్థ బాంకింగ్.   

ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణల బలంతో ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటు ప్రగతి పథంలో దూసుకెళ్లడానికి రంగం సిద్ధమయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రస్తుతం మౌలిక సౌకర్యాల రంగం గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంపై కేంద్రీకరించిందని ఆయన వెల్లడించారు. ఒక కార్యక్రమంలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సరయిన సమయంలో వృవస్థీకృత సంస్కరణలు అమలు చేయడానికి పూను కుందని ఫలితం గా రానున్న రోజుల్లో అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుందని అన్నారు.
arun jaitly FRDI bill in English కోసం చిత్ర ఫలితం

ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేసిందని పేర్కొన్నారు. దీని కిప్పుడు మరో సారి సామాన్యునిపై మోపబోతున్న భారం "ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు-ఎఫ్.ఆర్.డి.ఐ." మనం  బ్యాంకు లో డబ్బు భద్రపరచు కుంటాం. అలా మనం పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకులు పారిశ్రామిక వేత్తలకు వ్యాపార వేత్తలకు ఇతర ఋణాలుగా ఇస్తాయి ఆ ఋణం తీసు కున్న ఋణాలు నిరర్ధక ఆస్తులు గా మారి వారు డబ్బు ఎగ్గొట్టినా ప్రభుత్వరంగ బ్యాంకులలో అయితే మన డబ్బు అయితే ఎక్కడికి పోదనే ఒక భరోసా మనకుంది ఇప్పుడు. 

arun jaitly FRDI bill in English కోసం చిత్ర ఫలితం

ఇప్పుడా భరోసాకి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చే చట్తం తెస్తూ ఆ నమ్మకాన్ని కూడా దూరం చేసే ఆలోచనతో "ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు" తీసుకొస్తోంది. దీని ప్రకారం మనం బాంకుల్లో పొదుపు చేసుకున్న బాంకులో మొండి బకాయిలు పెరిగిపోయి ఒకవేళ బ్యాంక్ దివాలా తీసే పరిస్థితే వస్తే, మన డబ్బుని  ఆ బ్యాంక్ మొండి బకాయిల కింద సర్ధుబాటు చేసుకునే వీలుకలుగుతుంది. దీన్నే "బెయిల్-ఇన్" అంటారు. 

సంబంధిత చిత్రం

బ్యాంకులలో బధ్రపరచుకున్న మన పొదుపు సొమ్ముకు ఇక బధ్రత ఉండటం అనే దానికి ఇక ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఉండదు. “ఈ ప్రతిపాదన పరిశీలనలోనే ఉంది, అభ్యంతరాలు అన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటాం” అని ఆర్ధిక మంత్రి జైట్లీ చెబుతున్నారు. ఈ బిల్లు చట్టం అవుతుందా? లేదా? అనేది పక్కన బెడితే ఇంత జాతి విద్రోహక సమాలోచనలు తలపులు ఈ ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నాయి? 
arun jaitly FRDI bill in English కోసం చిత్ర ఫలితం

నోట్లరద్దు లాంటి గొప్ప నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేయలేక దాన్ని ఒక అపహస్యంగా మార్చిన ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఇలాంటి ఆలోచనలు ఎందుకు? ప్రజలు భయపడి పోయి బ్యాంకులలో ఉన్న డిపాజిట్లు అన్నీ వెనక్కి  తీసుకునే ప్రయత్నం చేస్తే బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో కూరుకుపోకుండా ఉంటున్దా?  ప్రభుత్వరంగ బ్యాంకులని నిర్వీర్యం చేసి అంబాని, ఆదాని లకు మార్గం సుగమం చేసే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉన్నాయా? అనే సంశయం ప్రజలకు కలుగుతూ వస్తుంది.
arun jaitly FRDI bill in English కోసం చిత్ర ఫలితం

ఈ బిల్లుపై విమర్శలు వస్తున్న క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. కస్టమర్ల డిపాజిట్ కు ఎటువంటి ప్రమాదం ఉండని అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. గత ఆగస్టులో ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై "సంయుక్త పార్లమెంటరీ కమిటీ-జెపిసి" తన నివేదికను ఇప్పుడు జరుగుతున్న ఈ శీతాకాల సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది. 

arun jaitly FRDI bill in English కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: