అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కోదండరామ్, కేసీఆర్ కలసి కట్టుగా ఐక్యంగా ఉద్యమించడం జరిగింది కనుక ఒకరి గురించి ఒకరికి వారి బలం ఏమిటి అనేది చక్కగా  తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వీరిద్దరి మధ్య వాతావరణం భిన్నంగా మారింది, పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉంది ఇప్పుడైతే .


తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు అనుకుంటున్న టైం లో  మొన్ననే కోదండరామ్ కొలువుల కొట్లాట సభ నిర్వహించి కెసిఆర్ కి  తానేంటో గుర్తుచేశాడు .తాజాగా కోదండరామ్ మరొక సంగ్రామానికి తెరలేపాడు అనే వార్త వినిపిస్తూ ఉంది ..   ఈ క్రమంలో రాష్ట్రంలో చనిపోయిన అన్నదాతల మీద   కోదండరామ్  దృష్టి సారించారు. రాష్ట్రం లో చనిపోయిన రైతుల  సంఖ్య  3362. అంటే సుమారుగా నెలకు 80 మంది అన్నదాతలు చనిపోయారు అన్నది జెఎసి చెబుతోంది.



ఈ క్రమంలో  ప్రభుత్వ అభివృధి  పథకాలన్నీ రాజకీయ నాయకులకు.. కాంట్రాక్టర్లకు.. మధ్య దళారులకు వరాలుగా మారుతున్నాయని జెఎసి వాదన.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్న కేసీఆర్ రాష్ట్రంలో రైతుల సమస్యల పట్ల దారుణంగా విఫలమయ్యారని జేఏసి విమర్శించింది . ఈ క్రమంలో కొలువుల కొట్లాట సభ  అలాగే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించేలా ఒక సభ నిర్వహించాలి అని జేఏసీ  నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: