హాలీవుడ్ లో పలు ఫోర్న్ చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అప్పటి నుంచి ఈ అమ్మడు వెను తిరిగి చూసుకుకోకుండా పలు చిత్రాల్లో హిరోయిన్ గా నటిస్తూనే..తెలుగు, హిందీ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది.  ఇక సన్నీలియోన్ అంటే హాట్ హాట్ గా రెచ్చిపోతుందని అందరికీ తెలుసు..దీంతో అమ్మడు తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  ఇక న్యూఇయర్ అంటే సెలబ్రెటీలు ముఖ్యంగా హీరోయిన్లు, మోడల్స్ కి పండుగే..పలు షోల్లో పాల్గొని కాస్త డబ్బు వెనుకేసుకుంటారు. 
Image result for pro kannada group sunny leone
ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా మన్యతటెక్ పార్కులో సన్నీలియోన్‌తో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  దీంతో చిర్రెత్తుకొచ్చిన  ప్రొ-కన్నడ గ్రూప్ కర్నాటక రక్షణ వేదిక యువసేన సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా  ఆందోళన నిర్వహించింది. ఈవెంట్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన కారులు పెద్ద సంఖ్యలో మన్యతటెక్ పార్కు ముందు చేరి..సన్నీలియన్ ఫొటోలు, పోస్టర్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సన్నీలియోన్‌తో ఈవెంట్ నిర్వహించడం భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేయడమేనని యువసేన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్ ని కనుక క్యాన్సల్ చేయకుంటే.. పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతాయని యువసేన సభ్యులు హెచ్చరించారు. సన్నీలియోన్ పొట్టి దుస్తులు ధరించి వస్తే మేం ఒప్పుకోం. ఇలాంటి వాటిని తాము ప్రోత్సహించమని..ఒకవేళ సన్నీలియోన్ సంప్రదాయబద్దంగా చీరకట్టులో వచ్చి ఈవెంట్‌లో పాల్గొంటే మేమంతా వెళ్లి చూస్తామని యువసేన రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్ తెలిపాడు. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  బెంగళూరులో డిసెంబర్‌ 31న జరిగే కొత్త ఏడాది వేడుకల్లో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ పాల్గొననున్న  కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. 

 అంతే కాదు కర్ణాటక రక్షణ వేదికే(కేఆర్‌వీ)తో పాటు పలు కన్నడ సంఘాలు సన్నీ వేడుకపై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. ‘అలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని నేను అధికారుల్ని ఆదేశించాను. కన్నడ సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఈవెంట్‌ నిర్వాహకులు చేపట్టాలి’ అని రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: