ప్ర‌త్య‌ర్థుల‌కు ఎప్పుడు ఎలా చెక్ చెప్పాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో! ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎప్పుడు ఎవ‌రిని అంద‌లమెక్కించాలో ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌! ఏపీ సీఎం చంద్ర‌బాబు, కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల‌కు ఎంత వైరుధ్యం ఉందో ఇట్టే చెప్పేయచ్చు. ఇది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విష‌యంలో మ‌రోసారి రుజువైంది.
Image result for kcr
ఏపీలో జ‌న‌సేనాని మూడు రోజుల ప‌ర్య‌ట‌న అనేక ప్ర‌శ్న‌ల‌ను మిగి ల్చింది. పోల‌వ‌రంతో పాటు ఒంగోలు ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ఇదే త‌ర‌హా లో తెలంగాణ‌లోనూ ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించిన ప‌వ‌న్‌కు నిరాశే ఎదురైంది. ప‌వ‌న్‌తో చంద్ర‌బాబు.. కొంత మెతక వైఖ‌రి అవ‌లంబించినా.. కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించి ప‌వ‌న్ దూకుడుకు బ్రేక్ వేశారు!!

Image result for jenasena

పార్టీ నిర్మాణంపై జ‌నసేనాని దృష్టిపెట్టాడు. రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించినా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీకే ప‌రిమితం అయ్యారు ప‌వ‌న్‌! మొద‌ట్లో అవ‌గాహన శిబిరాలు తెలంగాణ‌లో నిర్వ‌హించినా.. త‌ర్వాత పూర్తిగా ఏపీలోనే ప‌ర్య‌టిస్తున్నారు. ఏపీలో డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్‌, పోల‌వ‌రం, కృష్ణా న‌దిలో బోటు మునిగి చ‌నిపోయిన వారి కుటుంబాల‌ను ఒంగోలులో ప‌రామ‌ర్శించ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌తో పాటు సమావేశాల ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేలా ప్ర‌ణాళిక రూపొందించి ప‌ర్య‌టించాడు ప‌వ‌న్‌! ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ పార్టీని విస్త‌రించాల‌ని.. తెలంగాణ జ‌న‌సేన నిర్ణ‌యించింది. 


అయితే 2019లో ఎన్నికల కు వెళ్లబోయే పార్టీగా ఇకనైనా తెలంగాణ లో తన వంతు ప్రచారం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ జనసేన కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు మురళి కుటుంబాన్ని పరామర్శించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీలో పర్యటిస్తున్న స‌మ‌యంలోనే వెల్లడించారు. ఏపీ లో పర్యటన పూర్తి అయిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి తెలంగాణ లోని గజ్వెల్ కు వెళ్లాలని పవన్ అనుకున్నారు. అయితే జనసేనాని ఒకటి తలిస్తే కేసీఆర్ మరొకటి తలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి, నిరుద్యోగి మురళి కుటుంబాన్ని సందర్శించేందుకు గాను తాను గజ్వెల్ వెళ్లనున్నట్టు పవన్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. 


పవన్ పర్యటనకు అవసరమైన బందోబస్తు తాము చేయలేమని, ప్రస్తుతం అయిదారుగురు మించి పోలీసులను కూడా పవన్ సెక్యూరిటీకి కేటాయించలేమని తెలంగాణ పోలీసులు చెప్పేశారు. దీంతో గజ్వెల్ పర్యటన ను పవన్ వాయిదా వేసుకున్నారు. దీనిని బట్టి తెలంగాణ లో పవన్ హడావుడి చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నచ్చని వ్యక్తుల పట్ల, వ్యతిరేక రాజకీయ కార్యకలాపాల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో తెలిసిన వారు మాత్రం.. తెలంగాణ లో మాత్రం ప‌వ‌న్ ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని, ఏపీ త‌ర‌హాలో ఆట‌లు సాగ‌వ‌ని స్ప‌ష్టంచేస్తున్నారు!!


మరింత సమాచారం తెలుసుకోండి: