తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ గొప్ప ఉద్యమకారుడిగా అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవిశ్రాంతి గా కృషి చేసి, అనేక ఉద్యమాలు , నిరాహారదీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా తెలంగాణ కు సేవలు అందిస్తున్నాడు. మరియు అతను మంచి తెలుగు భాషాభిమాని అని, అతను మాట్లాడే భాషా కూడా తెలంగాణా యాసలోనే ఉంటుంది . అచ్చమైన తెలుగు భాష లోనే రాజకీయ విమర్శలు కుడా చేస్తుంటాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవల్సివస్తుంది అంటే, ప్రపంచ తెలుగు మహా సభలు నిన్న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి.

ఆ సభలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మరియు అసదుద్దీన్ ఒవైసి హాజరయ్యారు. ఆ సభలో సిఎం కేసిఆర్ పద్యాలు పాడి అందరిని రంజింపచేసినాడు. తెలుగు సాహిత్యావేత్తల గురించి తన ప్రసంగంలో ప్రసంగించాడు. తన కాలేజీ రోజుల్లో తనకు తెలుగు మీద ఎంత మక్కువో వివరించాడు. మరియు తెలంగాణలో ఒకటి నుంచి పదవతరగతి వరకు ఖచ్చితంగా తెలుగు చదవాలనే నిభందనను తీసుకోచ్చా అని చెప్పుకొచ్చాడు.
Image result for world telugu conference 2017 telangana photos
కెసిఆర్ స్పీచ్ ఆద్యంతం అందరిని ఆకట్టుకున్నది. మరియు అసదుద్దీన్ ఒవైసీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రసంగంచిడం అందరిని అశ్ఛర్య పరిచింది. అందరు చప్పట్లతో ఉత్సాహపరిచినారు. తన ప్రసంగంలో హిందూ, ముస్లింలు పాలు, నీరులా కలిసి ఉండాలని తెలుగు భాషా చాలా గొప్పదని మాట్లాడడం అందరిని అనందపరిచింది. ఈ విధంగా రెండోసారి హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలు  తెలుగు భాషాను విశ్వవ్యాప్తం చేశాయి. తెలుగు యొక్క మాధుర్యాన్ని, అందులోని తియ్యదనాన్ని మరో ఎత్తుకు తీసుకుపోయేలా ఈ తెలుగు మహా సభలు జరిగాయి.
Image result for world telugu conference 2017 telangana photos
తెలుగు భాషాభివృద్ది కి కృషి చేసిన ఎందరో మహానీయులును ఈ సందర్బంగా గుర్తు తెచ్చుకున్నాము. ప్రపంచంలోని తెలుగు ప్రజలు అందరూ గర్వపడేలా, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాషా విశిష్టతను తెలియపరిచాయి. భారతదేశంలో హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడే భాషా మన తెలుగు భాషా. మధురమైన భాషా గా, తియ్యనైన భాష గా ప్రసిద్ది చెందింది. తెలుగు భాషాభివృద్దికి బమ్మెరపోతన, పాల్కురికి సోమన, కంచర్ల గోపన్న, ఎంతగానో కృషి చేసినారు. కాకతీయుల కాలంలో అసలైన తెలుగు భాషాభివృద్ది జరిగింది. తెలుగు వారు గొప్పగా చెప్పుకునేలా ఘన, కీర్తిలను అందుకున్నది.  



మరింత సమాచారం తెలుసుకోండి: