హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.  ఈ కార్యక్రమానికి  తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాష తో పాటు గొప్ప సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి ఈటల రాజేందర్. 

తెలంగాణలో తెలుగు భాష ఔన్నత్యం గురించి నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో గొప్పగా వర్ణించారు గుర్తు చేశారు.  మన తెలంగాణలో కవులు, కళాకారులకు కొదవలేదని..భారత దేశంలో తెలంతగాణ సంస్కృతి అన్నా..యాస అన్నా చాలా మంది ఇష్టపడతారని ఆయన అన్నారు.  ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులు పోషించిన పాత్ర అనీర్వచనం అన్నారు. 

తెలంగాణ పల్లె పల్లెలో ఉద్యమ స్ఫూర్తి నింపారని అన్నారు.  కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం ఉండాలన్నారు. ఒక సిరా చుక్క ఎంతో మందిని కదిలిస్తుందన్నారు. తెలంగాణ పాటలు, ఆటలు ప్రజల గుండెల్ని కదిలించాయని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు ఈటల రాజేందర్.


మరింత సమాచారం తెలుసుకోండి: