వైయస్ఆర్సీపీ పార్టీలు అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి ..ముఖ్యంగా మహిళా విభాగంలో  ఎమ్మెల్యే రోజా విషయంలో ఈ పరిణామాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా పెరుగుతున్న రోజాపై వైసీపీ పార్టీ నాయకులే జగన్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె మాట తీరు వల్లే  ఆమెకు శత్రువులు ఉన్న కొద్ది పెరుగుతున్నారని వాదన వినిపిస్తుంది.

మరోవైపు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పబ్లిసిటీ కోసం అని కొంతమంది అంటున్నారు. గతంలో అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసి శాసనసభకు కొంత కాలం దూరం అయ్యారు. రీసెంట్ గా   ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా బండ్ల గణేష్ పై  ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

పబ్లిక్ గా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కి తీవ్ర నష్టం కలిగించే  విధంగానే ఆమెపై అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి ఆ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది వైయస్ఆర్ సీపీ నాయకులు రోజా ను హద్దుల్లో పెట్టుకోవాలని మీడియా సమావేశాలకు దూరంగా ఉంచితే బాగుంటుందని తమ  నేత జగన్ కి  సలహాలు ఇచ్చారట.

రాబోయే రోజుల్లో రోజా ఈ విధంగా వ్యవహరిస్తే పార్టీ ప‌రువు బ‌జారున ప‌డుతోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి, రోజాపై జ‌గ‌న్ ఇప్ప‌టిక‌యినా చ‌ర్య‌లు తీసుకుంటారా..? లేదా..? అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: