గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ మద్య ఉత్కంఠ పోరు నెలకొన్న విషయం తెలిసిందే.  అయితే ఎన్నికల సందర్భంగా హేమా హేమీలు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.  ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహూల్ గాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు.  ఇక రెండు దశల్లో పోలింగ్ పూర్తయ్యింది.  ప్రస్తుతం రిజల్ట్ కోసం ఇరు పక్ష నేతలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. 
Image result for gujarat elections
అయితే  గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తుంది.  తాజాగా బీజేపీకి చెందిన  రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ కాక‌డే మాత్రం... త‌ప్ప‌కుండా ఓడిపోతాం అంటూ జోస్యం చెప్ప‌డంతో అంతరూ ఖంగు తిన్నారు.  తాను జ‌రిపిన స‌ర్వేలో దాదాపు 75 శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచినట్లు తేలింద‌న్నారు.
Image result for gujarat elections
గుజరాత్‌లో తొలిసారిగా దళితులు, ఓబీసీలు, ముస్లింలు, పటేల్‌ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపార‌ని, మోదీ ప్రధాని అయిన త‌ర్వాత గుజరాత్‌ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం కూడా ఓటమికి కారణమ‌ని అన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై బీజేపీ అధిష్టానం మండిప‌డుతోంది. అయితే, ఇదంతా ఆయ‌న స‌ర్వేలో వెల్ల‌డైందంటూ కాక‌డే ప‌లు కార‌ణాల‌ను వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: