దివంగత జయలలిత (అమ్మ) సొంత నియోజకవర్గం ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో నగదు పంపిణీ మళ్లీ కలకలం రేపింది.  ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి 12.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సెల్విని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వందలాది మంది దినకరన్ అనుచరులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు.

దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలో కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే కారణాలతోనే ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి దినకరన్ వర్గం భారీగా డబ్బులు పంపిణీ చేస్తోందనే వార్తలతో ఈసీ ఎలా స్పందిస్తోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నెల 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. 59 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

ఇంతకు ముందు ఏప్రిల్‌ 12న జరగాల్సిన ఎన్నిక ఓటుకు నోటు నేపథ్యంలోనే రద్దైన విషయం తెలిసిందే. ఆ సమయంలో దినకరన్‌ పై తీవ్ర ఆరోపణలు రాగా, ఆ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల దాకా డబ్బు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: