జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్‌గా త‌న దూకుడును పెంచారు. 2014లోనే పార్టీ పెట్టినా అప్ప‌టి ఎన్నిక‌ల్లో మౌనంగా ఉన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు 2019 ఎన్నిక‌ల సీజ‌న్ దూసుకువ‌స్తున్న స‌మ‌యంలో త‌న వేడిని పెంచారు. వాస్త‌వానికి ఏపీకి చెందిన వ్య‌క్తి కావ‌డంతో త‌న రాజ‌కీయాల‌ను ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం చేస్తార‌ని రాజ‌కీయ నేత‌లు భావించారు. ప‌వ‌న్ అప్ప‌ట్లో వ్య‌వ‌హ‌రించిన తీరు కూడాదీనికి బ‌లాన్ని చేకూర్చింది. 2014లో ఆయ‌న ఏపీలో మాత్రమే ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నాడు. అదేవిధంగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, బీజేపీల ప‌క్షానే ప్ర‌చారం నిర్వ‌హించాడు. తెలంగాణ జోలికి కూడా పోలేదు. అక్క‌డి అప్ప‌టి ఎన్నిక‌ల‌పై కామెంట్లు కూడా చేయ‌లేదు. దీంతో అంద‌రూ ప‌వ‌న్ రాజ‌కీయాలు ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం అవుతాయ‌ని, రాబోయే రోజుల్లో ఏపీలో మాత్రమే ప‌వ‌న్ దూకుడు ఉంటుంద‌ని భావించారు. 

ఇటీవ‌ల ఆయ‌న ఏపీలోనే మూడు రోజులు విస్తృతంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌సంగించాడు కూడా. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఎక్క‌డా అక్క‌డి ప్ర‌భుత్వంపై కానీ, పాల‌న విష‌యాల‌పై కానీ దృష్టి పెట్ట‌లేదు. ఎలాంటి కామెంట్లూ చేయ‌లేదు. సో.. ప‌వ‌న్ పొలిటిక‌ల్ కెరీర్ కేవ‌లం ఏపీకే అనుకున్న త‌రుణంలో ప‌వ‌న్ ఒక్క‌సారిగా బాంబు పేల్చాడు. త‌న రాజ‌కీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటాయ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అదేస‌మయంలో పార్టీలో యువ‌ర‌క్తాన్ని పెంచే క్ర‌మంలో ముందు తెలంగాణ‌లోనే కేడ‌ర్‌ను నియ‌మించే ప్ర‌య‌త్నాలు చేశాడు. దీంతో ఇప్పుడు ప‌వ‌న్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌న రాజ‌కీయాలకు తెర‌దీస్తున్నాడ‌నే విష‌యానికి బ‌లం చేకూరింది. ఈ క్ర‌మంలో తాజాగా వ‌చ్చిన స‌మ‌చారం ప్ర‌కారం ఏపీలో మాదిరిగా తెలంగాణలో పర్యటించి ప్రత్యక్షపోరులోకి దిగాలని పవన్‌ భావిస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో ప్రజా సమస్యలను గుర్తించే పనిలో జనసేన తెలంగాణ శాఖ నిమగ్నమయింది. తెలంగాణలో వివిధ సమస్యలపై అంశాల వారీగా జనసేనాని పవన్‌ పోరాడనున్నారు. రైతులు, దళితులు, నిరుద్యోగుల సమస్యలపై ఆయన గళం విప్పనున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే  జనసేన పార్టీని రాష్ట్రంలో విస్తరించాలని జనసేనాని భావిస్తున్నారు.  తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. పార్టీ విద్యార్థి విభాగం , యువజన విద్యార్ధి విభాగం , యువజన విభాగం మహిళా వింగ్‌ల నియామకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో వీటిని అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీల్లో ఉన్న పాత యువరాజ్యం నాయకులను పవన్ తిరిగి జనసేనలోకి ఆహ్వనించాలని భావిస్తున్న‌ట్టు జ‌న‌సేన అభిమానుల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలంగాణ తెలుగుదేశం, వైసీపీలలోని నాయకులు.. లోక్ సత్తా పార్టీ క్యాడర్‌ జనసేనలో చేరటానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

గ్రేటర్ హైద్రాబాద్ , ఖమ్మం, ఉమ్మడి నిజమాబాద్ , ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.  తెలంగాణ జనసేన పార్టీకి బీసీ వర్గానికి చెందిన నేమూరి శంకర్ గౌడ్‌ను పవన్‌ అధ్యక్షుడిగా నియమించారు. శంకర్ గౌడ్ యువరాజ్యంలో పవన్ టీంలో యాక్టివ్ గా పనిచేశారు. యువ రాజ్యంలో కీలకంగా వ్యవహరించిన మరో నాయకుడు మెదక్ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డిని జాతీయ ఉపాధక్షుడిగా నియమించారు. ప్రస్తుతం వీరిద్దరే తెలంగాణ జనసేనకు అన్ని తామై వ్యవహరిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా పార్టీ కార్యాలయానికి జనసేన పార్టీ స్ధలాన్ని అన్వేషిస్తోంది. మొత్తంగా ప‌వ‌న్ తెలంగాణ‌లోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే స్కెచ్ గీసిన‌ట్టు చెబుతున్నారు. ప‌వ‌న్ దూకుడు ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: