ఈ మద్య ఈజీ మనీ కోసం చాలా మంది అడ్డదారుల్లో వెళ్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు.  ఇక సెలబ్రెటీలు కొంత మంది లగ్జరీ జీవితాలకు అలవాటు పడి కొంత మంది అక్రమదారుల్లో వెళ్తున్నారు.   హైదరాబాద్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని తాజ్ దక్కన్ స్టార్ హోటల్‌లో.పోలీసులు దాడులు జరిపారు. ఈ రైడ్స్‌లో జూన్‌ సినిమా ఫేం రిచా సక్సేనా పట్టుబడింది.  రిచా శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Richa
ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ లక్ష, ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విటుల రూపంలో వెళ్లి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఈ వ్యభిచార వ్యవహారంమంతా ఆన్‌లైన్‌ ద్వారా సాగుతున్నట్లు తేల్చారు పోలీసులు.   వీరితో పాటు ఆన్ లైన్ మాధ్యమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న కాస్టింగ్ డైరెక్టర్, మరో ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. వ్యభిచారం కేసులో పట్టుబడిన హీరోయిన్లు రిచా సక్సేనా, శుభ్రా చటర్జీ….పంజాగుట్ట పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్.

ఇక ఈ కేసులో ముంబైకి చెందిన మోనిశ్ కపాడియా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనార్దన్ అలియాస్ జానీలు కీలకమని డీసీపీ రాధాకిషన్ రావు వెల్లడించారు.  సినిమా, టీవీ నటులను ఈ ఉచ్చులోకి దింపి, ఆపై వారి చిత్రాలను వాట్స్ యాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాడని, ఎవరైనా బుక్ చేసుకుంటే, విమానాల్లో వారిని రప్పిస్తాడని అన్నారు. హోటల్స్ లో రూములు సిద్ధం చేసి, హీరోయిన్స్ ను లోపలికి పంపి, లాబీల్లోనే డబ్బుల లావాదేవీలు పూర్తి చేసుకుంటారని తెలిపారు.

ఆపై రూమ్ యాక్సెస్ కార్డులను విటులకు ఇచ్చి, గది నంబర్ చెప్పి పంపుతాడని అన్నారు.  ఇద్దరినీ విటులకు పరిచయం చేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ మాధ్యమంగా ప్రకటనలు ఇచ్చి, వీరిని హోటల్స్ కు తీసుకు వచ్చారని, కేసును విచారిస్తున్నామని అన్నారు. ఈ దాడుల్లో నటి రిచాతో పాటు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మౌనిక కడాకియా, హోటల్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: