గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో క్షణక్షణానికి ట్రెండ్స్ మారుతున్నాయి. క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆధిక్యం బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య తారుమారు అవుతోంది.  ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ ఇదే స్థితిని కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ కు 89  చోట్ల ఆధిక్యంలో ఉండగా.. బీజేపీకి 79 చోట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.
Image result for gujarat election result
కాసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇంతలోనే మళ్లీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ 106 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 74 స్థానాల ఆధిక్యానికి పడిపోయింది. ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే, గుజరాత్ లో హోరాహోరీ పోరు జరిగిందనే విషయం అర్థమవుతోంది. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో పోరు ఏకపక్షంగా సాగుతోంది. బీజేపీ 21 స్థానాల్లో, కాంగ్రెస్‌ 22స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి.


గుజరాత్‌లో 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 92 సీట్లు
హిమాచల్‌లో 68 స్థానాలకు 337 మంది అభ్యర్థుల పోటీ
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మ్యాజిక్‌ ఫిగర్‌ 35 సీట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: