గుజరాత్ లో అధికార బీజేపీ మళ్ళి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. కాకపోతే ఇదివరకటికంటే కొంత తక్కువ మెజారిటీ వచ్చే అవకాశాల ఉన్నట్టు ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది.. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ107 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 69 స్థానాల్లో ముందంజలో ఉంది.. తుది ఫలితాలు రావాల్సి ఉండగా.

ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన తాజా అధికారిక ప్రకటన ప్రకారం, ఇప్పటివరకూ ఏ ఒక్క స్థానంలోనూ తుది ఫలితం వెల్లడి కాలేదు. ఓట్ల లెక్కింపు అన్ని నియోజకవర్గాల్లో మొదలైంది. 97 చోట్ల బీజేపీ, 64 చోట్ల కాంగ్రెస్, ఒక్క చోట ఎన్సీపీ, 2 చోట్ల బీటీపీ (భారతీయ ట్రైబల్ పార్టీ), 3 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Image result for gujarat election result
కొద్దిసేపటి కిందట ఫలితాలు రెండు పార్టీల మధ్య దోబూచులాడాయి.. ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి అధికారం దిశగా అడుగులు వేస్తుంది..  గుజరాత్‌లో 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 92 సీట్లుగా ఉంది.  ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బీజేపీకి 48.5 శాతం, కాంగ్రెస్ కు 42.5 శాతం ఓట్లు వచ్చాయి. 1.9 శాతం ఓటర్లు 'నోటా'ను ఎంచుకోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: