డైనోసార్లు అనగా వెర్టెబ్రేట్ జాతికి చెందిన, 160 మిలియన్ సంవత్సరాలకు మునుపు, భూమ్మీద సంచరించిన ఒక రకమైన జంతువులు.  కొండల్లాంటి భారీ శరీరాలతో, భీకర స్వరాలతో గంభీరంగా కనిపించే డైనోసార్లు మన చరిత్రకు కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. డైనోసార్ల జాతి ఇప్పటికీ, ఎప్పటికీ ఓ వీడని మిస్టరీయే.. ఇవి ఎలా జన్మించాయో, ఎలా అంతమయ్యాయో తెలియజెప్పేందుకు స్పష్టమైన ఆధారాలే దొరకడం లేదు. 
dinosaur found india uttarakhand
తాజాగా ఉత్తరాఖండ్‌లోని జాస్పర్‌ నగర సమీపంలో తాజాగా బయల్పడిన జంతు కళేబరం ఒకటి ప్రస్తుతం పురాతత్వ శాస్త్రవేత్తల బుర్రలకు సవాలు విసురుతోంది. ఈ మృత జంతువు అచ్చం డైనోసార్‌ను పోలి ఉంది. అయితే దాని ఎముకలకు ఇప్పటికీ మాంసం వేలాడుతుండటం శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. 
Image result for dinosaurs
ఎగరలేని డైనోసార్‌గా శాస్త్రవేత్తలు తొలుత దాన్ని భావించారు. అయితే, సదరు జాతి డైనోసార్లు దాదాపు 6.5 కోట్ల ఏళ్ల క్రితమే అంతరించిపోయాయని వారు తెలిపారు. ఇది 35 ఏళ్లుగా వినియోగంలో లేని ఓ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను శుభ్రం చేస్తుండగా కార్మికుడొకరు ఈ కళేబరాన్ని గుర్తించాడు. అది కేవలం 28 సెంటీమీటర్ల పొడవు ఉంది.  కార్బన్‌ డేటింగ్‌ విధానంలో శిలాజం వయసును గుర్తించాకే.. ఈ జీవిపై నిర్ధారణకు వస్తామని వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: