తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా  తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ప్రక్కనే ఉన్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడును ఆహ్వానించకపోవడంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.నిజానికి, మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ గురించి చ‌ర్చిస్తున్న ద‌శ‌లోనే సీఎం కేసీఆర్ కూడా ఇదే విష‌య‌మై ప్ర‌స్థావించార‌నీ, చంద్ర‌బాబును ఆహ్వానిద్దామ‌ని అనుకున్నార‌నీ క‌థ‌నాలొచ్చాయి. కానీ చివరాఖరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడును పక్కన పెట్టేశారు.

చంద్రబాబు ఆహ్వానించక పోవడం అనే అంశం పై ఇప్పుడు కేసీఆర్ సర్కార్ దిద్దుబాటు చర్యలను చేపడుతూ తమ అధికారుల ద్వారా లీకులు   ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో  మహాసభల కు చివ‌రి రోజు 19న అంటే ఇవాళ రాష్ట్రప‌తి కూడా వ‌స్తున్నారు కాబ‌ట్టి, ఆరోజున చంద్ర‌బాబును పిలిస్తే బాగుంటుంద‌ని అనుకున్నార‌ట‌.

అయితే, ఈ విష‌యాన్ని నేరుగా చంద్ర‌బాబుతో కాకుండా, కొంత‌మంది స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలంగాణ సర్కారు వాక‌బు చేస్తే.. అప్ప‌టికే ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు చంద్ర‌బాబు ఫిక్స్ అయిపోయాయ‌ని తెలిసింద‌ట‌ .  నిర్వహణకు ముందు తెలంగాణ సర్కార్ చంద్రబాబు యొక్క షెడ్యూల్  గురుంచి వాకబు చేశారట.ఈ క్రమంలో చంద్రబాబు పిలిచినా రాలేదని  విమర్శ ఆయన మీద పడకుండా తెలంగాణ సర్కార్ ఈ విధంగా వ్యవహరించిందని తమ పార్టీ వర్గాల ద్వారా తెలియజేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: