పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు కిరికిరిలో పడ్డారని సమాచారం. ఆ ఇద్దరు ఇక రాజీనామాలు చేసేందుకు సిద్దమయ్యారని తెలుస్థోంది. ఆదివారం సిఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలుమంత్రులతో జరిగిన సమావేశంలో వారిద్దరికి పరిస్థితులు ప్రతికూలించినట్టు తెలిసింది.

సీమాంధ్ర ప్రాంతమంతా పార్టీలకతీతంగా ఉద్యమిస్తుంటే మీరు రాజీనామాలు చేయకుండామమ్మల్ని చేయకుండా ఉంచడంలో అర్థంలేదనిప్రజల్లోనే వ్యతిరేకత వచ్చాక అధిష్టానం అంటూ కూర్చుంటే రాజకీయంగా భూస్థాపితం అయినట్టేనని ముక్థకంఠంతో స్పష్టం చేసారట ఎమ్మెల్యేలుమంత్రులు. అంతా అయ్యాక తలపట్టుకుంటే లాభం లేదనిచేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టేనని చెప్పినట్లు అనుకుంటున్నారు.

సిఎంబొత్సలిద్దరు ఏంచేస్తాంఅధిష్టానానికి చెప్పాల్సిదంతా చెప్పాంరాజీనామాలు చేస్తె రాష్ట్రపతి పాలన విధించిరాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చిందనిదీంతో రాజీనామాలు చేస్తే మన వాదన వినిపించే అవకాశం కూడా పోతుందని అన్నాకూడాఎవరు పట్టించుకోకుండా వారిద్దరిని రాజీనామాలు చేయాల్సిందేనని చెప్పడంతో ఇప్పుడు ఆవిషయమై పునరాలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అయితే ఇక్కడో లాజిక్ వుంది. బోత్స, కిరణ్ లను తెరవెనుక వుండి నడిపిస్తున్నది కెవిపి రామచంద్రరావు అని తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని, ప్రభుత్వం మన చేతుల్లో వుంటేనే ఉద్యమాన్ని మరింత సులువుగా నడపవచ్చని కెవిపి చెప్పినట్లు తెలుస్తోంది.  మరి అలాంటపుడు, కెవిపి ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆ మాట చెప్పాలి కదా?

 

మరింత సమాచారం తెలుసుకోండి: