రామ్ గోపాల్ వర్మ అసాధ్యుడు. పిచ్చిమాటల్లా అనిపిస్తాయి కానీ, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసినవాడు. తను మాట్లాడిన మాట తూటాలో దూసుకుపోయేలా చేయగలిగినవాడు. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో అతగాడు చేసిన కామెంట్లు దుమ్ము రేపుతున్నాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలని వర్మ ట్విట్టర్ ద్వారా కోరాడు. పైగా అంతటితో ఆగకుండా, పవన్ రాజకీయాల్లోకి వస్తే, డైనమిక్ లీడర్ గా ఎదుగుతాడని, అంతే కాదు, ఎంజీఆర్ నుంచి చిరంజీవి వరకు ఇప్పటి దాకా వచ్చిన నట రాజకీయ నాయకులందరినీ మరిపిస్తాడని ముక్తాయించాడు.
పవన్ తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆ మధ్య గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. అన్న చిరంజీవితో అభిప్రాయ బేధాలు వచ్చిన నేపథ్యంలో వర్మ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సహజంగానే సంచలనం కలిగిస్తాయి. వర్మకు కావాల్సింది కూడా అదే.

మరింత సమాచారం తెలుసుకోండి: