సోనియాగాంధీ తెలంగాణాకు సంబంధించి త్రిమూర్తలతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. దిగ్విజయ్ సింగ్, మొయిలీ, ఆంటోనీ సభ్యులు. అసలు ఓ ప్రయివేటు వ్యక్తులతో కూడిన కమిటీని హై పవర్ కమిటీ అని ఎలా అనాలో అర్థం కాదు.

పైగా కాంగ్రెస్ పార్టీ నేతలు వారు. అది పార్టీ కమిటీ. మరి సీమాంధ్రకు సంబంధించిన సమస్యలను తెలుగుదేశం, తదితర పార్టీలు ఎలా ఆ కమిటీకి ఎలా నివేదిస్తాయి? ఎందుకు నివేదిస్తాయి? అన్నది ఇక్కడ పాయింట్. ఇది కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు హైపవర్ కమిటీ అనుకుందాం. మరి ఈ కమిటీ నివేదిక ఇచ్చేవరకు మంత్రివర్గం ముందుకు తెలంగాణా తీర్మానం రాకుండా ఆపుతారా? లేక దాని పని దానిదే అని అంటారా? అలా అన్నపక్షంలో ఇది కంటి తుడుపుకమిటీ అవుతుంది తప్పవేరు కాదు.

ఇదిలా వుంటే ఇప్పటికే ఓ నిర్ణయానికి రావడానికి కారణమైన వారు, సమస్యపై ఒక ధృఢమైన మైండ్ సెట్ వున్న సభ్యులతో కూడిన కమిటీ ముందు మొరపెట్టుకుని ప్రయోజనం ఏముంటుంది? అదే కనుక వేరే సభ్యులయితే సమస్యను కొత్త కోణంలో చూడడానికి అవకాశం వుంటుంది కదా?

మరింత సమాచారం తెలుసుకోండి: