తెలంగాణా, సీమాంధ్ర విభజన ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ ముందుగా రెండు పిసిసిల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది.. అయితే ఇక్కడ కులాల లెక్కలు తేలక ఆలస్యమవుతోంది. తెలంగాణా పిసిసికి ధర్మపురి శ్రీనివాస్ ను ఎంపిక చేయాలని అనుకున్నారు. తెలంగాణా  ప్రాంతంలో వుండే బిసిలను ఆకట్టుకోవచ్చని ఆలోచన. అయితే తెలంగాణా ఏర్పాటు చేస్తే, తమ అధికారం పోతుందని భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి కూడా భరోసా ఇవ్వాల్సి వుంది.  

అందుకోసం జనారెడ్డి లేదా ఉభయ తారకంగా వుండేలా గీతారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. కానీ ఆంధ్రలో మాదిరిగానే పిసిసి బిసిలకు, ముఖ్యమంత్రి పదవి రెడ్లకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా వుంది. అయితే అది పసిగట్టే, కెసిఆర్ ఎస్సీలే ముఖ్యమంత్రి అన్న పల్లవిని ఒక్కసారిగా మళ్లీ వినిపించారు. దీంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది. గీతారెడ్డినే ప్రస్తుతానికి పిసిసికి నియమించాలన్నదే ఆలోచనగా కనిపిస్తోంది.

ఇటు రెండు సామాజిక వర్గాలు, తెలంగాణా తొలి పిసిసికి మహిళ నియామకం అన్నవి కలిసి వస్తాయన్నది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. అయితే డి. శ్రీనివాస్ మాత్రం తన పట్టుదల విడవకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎలాగైనా తెలంగాణా తొలి ముఖ్యమంత్రి తానే కావాలన్నది జనారెడ్డి పట్టుదల.అందువల్ల ఆయన తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: