లెప్ట్ పార్టీలో ఒకటి లెప్ట్ అంటే మరొకటి రైట్ అంటాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం ఏకమాటపై వుండడంలో. అదే తెలుగుదేశానికి మద్దతు పలకడం. పాపం వాటి నాయకత్వాల సామాజిక బాధలు వాటివి. సరే ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం రాష్ట్రం కీలక మలుపులో నిల్చున్న వేళ ఈ పార్టీల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. సిఫిఐ తెలంగాణాకు మద్దతు పలుకుతుంది. సిపిఎం ది సమైక్యవాదం.

కానీ చిత్రంగా ఈ రెండూ కూడా ఈ  చీలిక పరిస్తితుల్లో చెరో వైపు బలంగా నిల్చోలేకపోవడం. సిపిఎం అధినేత రాఘవులు ఇంత వరకు ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు. చంద్రబాబులాగే ఆయనా మూతికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నారు. ఇక నారాయణ మరీ చిత్రం. ఆయన తెలంగాణా వచ్చిందని సంతోషపడడం లేదు. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని, సీమాంధ్రులకు కూడా న్యాయం చేయాలని కొత్త మాటలు మాట్లాడుతున్నారు.

తెలంగాణా విడగొట్టాలని పదే పదే కోరినపుడు ఈ ఆలోచనలన్నీ ఏమయినట్లో?  నిన్నటి దాకా అయితే కాంగ్రెస్ తో, లేకుంటే దేశంతో కలిసి పోటీ చేయడమే వీటికి తెలిసిన విద్య. మరి రాష్ట్రం చీలిపోతే, ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణాలో మార్కిస్టు పార్టీ కనిపించవా? తెలుగుదేశం పార్టీ చేరో రాష్ట్రంలొ చెరో పార్టీతో జతకడుతుందా? చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: