రాష్ట్రంలో ఈసారి జరిగిన ఉప ఎన్నికలను జూదంగా మార్చి వేశారు. ప్రజలచేత వారి ప్రతినిధులను ఎన్నుకునే పవిత్రమైన రాజ్యాంగ ప్రక్రియను అపవిత్రం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం, దీని కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం, ఉప ఎన్నికల్లో పలితాలు మాకు ఆశాజనకంగా ఉంటాయి... టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బుధవారం కరీంనగర్ లో విలేఖరులతో అన్న మాటలివి. పలు విషయాలను ఈసంధర్భంగా ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఎన్నడు లేని ఈసారి ఎన్నికల పలితాలపై కోట్లాదిరూపాయల బెట్టింగులు కట్టి జూదాల సరసన ఎన్నికలను చేర్చడం బాధాకరమని చెప్పారు. ఈఎన్నికల్లో డబ్బులను వెదజల్లి ఓట్లు కొనుగోలుకు ఎగబడ్డారని ఆయన ఆరోపించారు. అయినా సరే ప్రజలకు అసలు విషయాలు తెలుసునని, పలితాలు తాము ఊహించినట్టు గానే టిడిపికి అనుకూలంగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం పూర్తి అవినీతిమయం అయిందన్నారు. ఖరీఫ్ వచ్చేసినా ఇప్పటికి రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు సరఫరా చేయలేదన్నారు. దీంతో అన్నదాతలు విత్తనాల కోసం పొరుగున ఉన్న మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలకు వెల్లి అధికధరలకు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. రైతు ప్రభుత్వంలో ఇదేంటని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ముందస్తు ఆలోచన,పక్కాప్రణాళిక లేకపోవడమే ఈపరిస్థితికి కారణమని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పాలకులు సొంత ప్రయోజనాలు వీడి ప్రజలకోసం పనిచేయాలని ఆయన సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: