లగడపాటి కాంగ్రెస్ నుంచి లంకెలేసినట్లే అంటున్నారు. ఆయన ఏపార్టీలోకి చేరుతున్నాడు అన్నది చెప్పకపోయినప్పటికి కాంగ్రెస్ నుంచి మాత్రం వెల్లిపోతున్నట్టు పరోక్ష సంకేతాలు జారీచేసారు. దీంతో సీమాంద్ర కాంగ్రెస్ లో ఆసక్తికర రాజకీయం చోటుచేసుకుంది.

సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ నుంచి అత్యంత కీలకంగా ప్రజలతో మమేకమై పాల్గొంటున్నది విజయవాడ ఎంపి లగడపాటి అన్నది అందరికి తెలిసిందే. ఏపిఎన్జీఓల హైదరాబాద్ సభ విజయవంతం కావడంతో అమితానందం ప్రకటించింది కూడా ఆయనే. ఇక ప్రజాఉద్యమం ఊపందుకున్నదని, అదే ప్రజలు కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోస్తున్నందున ఇక జంప్ చేయడానికి ఇదే అసలైన సమయమని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

పైగా కాంగ్రెస్ తమ మాట వినకుండా తెలంగాణ ఏర్పాటుకు ముందుకుపోతే పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఉద్యమిస్తానని గతంలోనే లగడపాటి ప్రకటించాడు. తాజాగా హోంమంత్రి షిండే వాఖ్యలు తెలంగాణ ప్రక్రియను ఆపలేదని స్పష్టం చేసాయి. అంతే కాదు తెలంగాణను ఓ స్టార్ బ్యాట్స్ మెన్ అడ్డుకుంటాడని ఆయన చెబుతూనే ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమారే నని అందరు అనుకుంటున్న విషయమే. ఇక సిఎం కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం నిర్ణయించాడేమో.. అందుకే లగడపాటి నోట కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్టు పరోక్ష సంకేతాలు వచ్చాయేమో అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: