ముఖ్యమంత్రి తన పదవిని, తన హోదాను మరచిపోయి అడ్డమైన దారిలో వెలుతూ నాదే సరైన దారి అంటూ గొంతు చించుకుంటుంటే ఆయనకు మరో తోక తాజాగా తోడైంది. ప్రభుత్వ కార్యక్రమం, పైగా రాష్ట్రానికంతటికి ముఖ్యమంత్రి అన్న విషయం మరచిపోయి రచ్చబండను సీమాంద్ర ఉద్యమ వేదికగా మలచుకుని రచ్చరచ్చ చేస్తున్న మన సిఎం కిరణ్ కు మరో తోక శనివారం విజయవాడ ఎంపీ లగడపాటి రూపంలో తోడుగా నిలచింది. దీంతో కాలుకాలిన కోతిలా వారిద్దరు తందాన అంటే తానతందానా అన్న రీతిలో విభజన అంశంపై విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ సమైక్యం ఆవశ్యకతను వివరిస్తూ తానే సమైక్య హీరోను అన్న రీతిలో శనివారం క్రిష్ణా జిల్లాలో నిర్వహించిన రచ్చబండలో రెచ్చిపోతే వారెవ్వా... వాట్ ఏ సమైక్య హీరో సిఎం అంటూ అదే సభలో విజయవాడ ఎంపీ లగడపాటి జతకలిపారు. ఏ విషయంలోనైనా తన చిలక జోస్యంతో నానా హంగామా చేసి రాష్ట్రంలోనే రాజకీయ జోకర్ లా పేరు తెచ్చుకున్న లగడపాటి మరోసారి తన జోకర్ అవతారాన్ని సిగ్గులేకుండా ప్రదర్శించారు. రచ్చబండ సభలో ప్రభుత్వ పథకాలు, వాటి అమలు గూర్చి అడిగి తెలుసుకుని అవి ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలి. కాని అది మర్చిపోయి అదేదో ఏపిఎన్జీఓలు ఏర్పాటు చేసిన సమైక్య ఉద్యమ సభలా భావించి తెగ ఉపన్యాసం దంచేసారు ముఖ్యమంత్రి, ఆయనను చూసి ఎంపీ లగడపాటి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి మొదట రచ్చబండ లోని అసలు విశేషాలు చెప్పి ఆతర్వాత తన సమైక్య సింహాన్ని పైకి తీసారు. కాని లగడపాటి తను మైకు తీసుకున్నాడో లేదో పిచ్చిలేచినా కోతిలా విరుచుకు పడ్డారు. రచ్చబండ కార్యక్రమం అన్న విషయమే మర్చిపోయారు, అదేదో సమైక్య ఉద్యమ సభలా భావించాడు, తెలుగుతల్లిని ముక్కలు చేస్తుంటే ఊరుకుంటామా, ఇదిగో దానిని నిలువరించేందుకు మన ముఖ్యమంత్రి లాంటి సింహాలు ముందుకు వస్తాయి. మన సిఎం కిరణ్ ఓ సారి మాట ఇచ్చాడు అంటే దానికి వెనుదిరగడు, ఇప్పుడు సమైక్య రాష్ట్రం కోసం తొడగొట్టాడు, ఇక దంచుడే దంచుడు, దంచుడే దంచుడు, దంచుడే దంచుడు అంటూ ఎన్ని సార్లు చెప్పాడో ఆయనకే తెలియదు. దీంతో ఇంకేముంది ముందుగా అనుకున్నట్టుగానే కిరణ్ తోక అయితే ఆయన వెంట నడిచే నారాయణలా లగడపాటి జత కలిసాడు అనుకున్నారంతా.

మరింత సమాచారం తెలుసుకోండి: