బాబోయ్... కాంగ్రెస్ బంగారం లాంటి వ్యూహం పన్నింది. తెలంగాణ బిల్లు విషయంలో అధిష్టానం ప్లాన్ ప్రకారం ముందుగా నిర్ణయించిన మేరకు సాగిపోవడానికి తొలివిడత సమావేశాల్లో ఎలా ముందుకు పోయిందో ఇప్పుడు కూడా అదే పద్దతిలో ముందుకు పోతోంది. ఎలా చేయాలి అన్నది ఇక్కడి నేతలకు ఏమి తెలియదు, అధిష్టానం దూత వచ్చి ఏది చెప్పితే అలా ముందుకు పోవడమే ఇక్కడ కాంగ్రెస్ నేతలు చేయాల్సింది అనడానికి కళ్లముందు కనిపిస్తున్న ఈ సీన్ కంటే ఇంకా ఏ ఉదహరణ కావాలి. తెలంగాణ బిల్లు తెల్లారితే రాష్ట్రానికి వస్తుందనగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు చేరుకుని అది అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చేవిదంగా మంత్రాంగం అంతా చేసి ఆ పని చేసి వెల్లిపోయారు. సరిగ్గా ఇప్పుడు రెండో దశ అసెంబ్లీ సమావేశాలు ఇక తెల్లారితే మొదలై తెలంగాణ బిల్లుపై చర్చ సజావుగా జరిగి తీరాల్సి ఉండగా సరిగ్గా అప్పటిలాగే ఇప్పుడు పార్టీ దూతగా ఏఐసిసి కార్యదర్శి కుంతియా హైదరాబాద్ కు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. అప్పట్లో దిగ్విజయ్ హైదరాబాద్ లో దిగిన వెంటనే పార్టీ నేతలతో మంతనాలు ఎలాగైతే చేసారో ఇప్పుడు కూడా కుంతియా అలారాగానే ఇలా తన ఫస్ట్ ఫేస్ మంత్రాంగాన్ని తెలంగాణ మంత్రులతో మొదలు పెట్టారు. శ్రీదర్ బాబు, జానారెడ్డిలతో ఆయన సమావేశం అయ్యారు. మరో మాజి మంత్రి కోమటిరెడ్డి కూడా ఆయనను కలిసి బిల్లుపై చర్చించారు. అయితే అప్పుడు తెలంగాణ బిల్లు రాగానే అది చర్చకు రాకుండా అడ్డుకుంటానని ముఖ్యమంత్రి ప్రకటించారు. సరిగ్గా ఇప్పుడు అదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనాసభవ్యవహారాల శాఖా మంత్రి శ్రీదర్ బాబు శాఖను మార్చి అది పక్కా సమైక్యవాది శైలజానాథ్ కు అప్పగించి ఇక తెలంగాణ బిల్లు తడాఖా చూస్తాం అంటూ తొడగొట్టి సవాల్ విసిరారు. పరిస్థితుల్లో కొద్దిగా మార్పు ఉన్నా... సిచువేషన్ మాత్రం సేమ్ టు సేమ్. అందుకే ఇప్పుడు కుంతియా ఏం చేస్తారు, ఆయన ఎలాంటి పథకంతో ముందుకు పోయి తెలంగాణ బిల్లు వ్యవహారాన్ని సజావుగా ముందుకు తీసుకుపోతారు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది. అయితే ఇదంతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధిష్టానం కలిసి ఆడుతున్న డ్రామా అని అప్పట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అసలు సమయానికి ముఖ్యమంత్రిని సభకు ఆప్సెంట్ అయ్యే ప్లాన్ వేసి ఆ పని పూర్తి చేసారని అభియోగాలు వెలుబడ్డాయి. అయితే ఇప్పుడు సిఎం మరింత గట్టిగా సవాల్ విసిరినంత పని చేయడంతో కుంతియా ఎలాంటి డ్రామా చేయిస్తాడంటూ ఆసక్తిగా మాట్లాడు కుంటున్నారు. కాని ఈ సారి అందరు తెలంగాణ బిల్లును చర్చిద్దాం, క్లాజుల వారీగా చర్చిద్దాం అనే అంటున్నారు. కాని వైఎస్సార్ సిపి సభను జరగకుండా అడ్డుకుంటే ఎలా అన్నది కాస్తా చర్చనీయాంశం అయింది. అప్పట్లో సరిగ్గా బిల్లు సభలో ప్రవేశపెట్టే సమయానికి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కూడా కాస్తా డ్రామాలాడారని అపవాదు మూట గట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. దిగ్విజయంగా ముందుకు పోయిన దిగ్విజయ్ బాటలో కుంతియా ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: