సోనియమ్మా... ఇంకా ఏం మిగిలిందమ్మా, అన్న వాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కారణం విభజన నిర్ణయంతో సీమాంద్రలో కాంగ్రెస్ పూర్తిగా కొట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీని ఎంతో పటిష్టం చేయాలని వ్యూహాత్మకంగా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుని ఎంతో స్ట్రాంగ్ పట్టున్న కాపు సామాజిక వర్గాన్ని, ఆ వర్గ ప్రముఖనేతలను కాంగ్రెస్ లో కలిపించుకుంది సోనియా. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కాపు వర్గాన్నంతా ఏకం చేసి విజయాలు సాధించి దాన్నంతా సోనియమ్మ చేతిలో పెడితే సోనియమ్మకు ఏమైనా తెలివుందా, ఆమె కాపాడుకోలేదు, చిరంజీవిని కాపాడుకోనీయలేదు అన్న భావం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రజారాజ్యం లో రాజ్యం పోయి, ప్రజలు పత్తాలేకుండా జారిపోయి చివరకు మిగిలింది చిరంజీవి ఒక్కడే. ఇక సోనియమ్మ ఆ మెగాస్టార్ ను పట్టుకుని ఎంత వేలాడితే ఏం లాభం అన్న అభిప్రాయాలయితే తాజాగా నెలకొన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టి పెట్టి కాంగ్రెస్, టిడిపిలలో ఉన్న కాపు సామాజిక వర్గాన్నంతా ఏకం చేసి తన పార్టీలోకి తెచ్చుకోగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రజారాజ్యం తరఫున కీలకంగా ఉన్నది కూడా కాపు నేతలే. విభజన నిర్ణయంతో చిరంజీవి సీమాంద్ర వ్యతిరేక విధానాలతో ఇప్పుడ అంతా ఒక్కటైన కాపు సామాజిక వర్గం ఎవరి దారి వారు చూసుకోవడం మొదలు పెట్టారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వారంతా మళ్లీ అదే పార్టీలోకి చేరుతున్నారు. దీనికి బోనస్ గా కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చిన వారు కూడా టిడిపిలోకే వచ్చే ప్రయత్నాల్లో ఉన్నార కారణం చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా సీమాంద్రలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గంపైనే కన్నేసి గాలం వేస్తున్నారు. ఇప్పటికే మంత్రి గంటా, ముద్రగడ, త్రిమూర్తులు వంటి వారి చేరిక టిడిపికి ఖాయమైనట్టే. దీంతో ప్రజారాజ్యం నుంచి కాంగ్రేస్ లో మిగిలేది చిరంజీవి మాత్రమే అన్నది స్సష్టమవుతోంది. దీంతో చిరంజీవి కూడా తన వర్గం అంటూ లేకుండా కాంగ్రెస్ లో ఒంటరి వాడు కాబోతున్నారన్న మాట. అంతే కాదు సీమాంద్రలో విజయానికి అత్యంత కీలకమైన సామాజిక వర్గాన్ని కాపాడుకోలేక పోవడం కూడా కాంగ్రెస్ పెద్ద మైనస్ పాయింట్. కాంగ్రెస్ మాట ఎలా ఉన్నా చిరంజీవి రేపు భవిష్యత్తులో మళ్లీ ఏదైనా కొత్త ఎత్తుగడతో కీలక భూమిక పోషించడానికి ప్రయత్నించాలన్నా కూడా ఆయన వెంట ఎవరు ఉండని పరిస్తితులు నెలకొన్నాయి. అందుకే కాంగ్రెస్ ఎ అందుకే కాంగ్రెస్ ఎప్పడయితే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుందో అప్పుడే చిరంజీవి వ్యతిరేకించి బయటకు వచ్చి సమైక్యాంద్ర కోసం పోరాడితే ఇప్పుడీ పరిస్తితులు వచ్చేవి కావన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: