తన ఖేల్ ఖతం అయింది అని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పకనే చెప్పారు. తన బాద్యతలు సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రధానికి అప్పగిస్తానని చెప్పి ఇక తనకు ప్రధాని అయ్యే అవకాశం లేదు, అందుకే తాను ప్రధానిగా చేసిన దానిని మీకు వివరిస్తున్నానన్నారు. ఇందులోను ప్రధాని తనపేరును సార్థకం చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ లోని మన్మోహన రూపాన్ని రూపాన్ని తన మాటల్లో చూపించారు. తాను ప్రధానిగా సమర్థుడినేనన్నారు, అలా అని రాహూల్ గాందీ అభ్యర్థిత్త్వాన్ని తోసి పుచ్చలేదు, ఆయన కూడా సమర్థుడేనన్నారు. అలా అని ఆయనే ప్రదాని అభ్యర్థి అంటూ తన నోట డైరెక్టుగా క్లియర్ చేయలేదు. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలా అని నేను ప్రధాన పదవికి తగిన వాన్ని కాదు అని మాత్రం చెప్పకుండా తన అసలు అంతరంగం ఏంటో కూడా పరోక్షంగా బయటపెట్టుకున్నారు. ఇలా అసలువిషయాన్ని చెప్పకనే చెబుతూ ప్రత్యర్థి మోడిని మాత్రం నిషితంగా విమర్శించారు. ఆయన దేశానికే చాలా ప్రమాదం అంటూ కాంగ్రెస్ పార్టీని మాత్రం మెచ్చుకున్నారు. ఆయన మనోగతం ఏంటో, ఆయన మనసు విప్పి చెప్పిన మాటల్లోని కొన్ని ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం.... నరేంద్రమోడి ప్రధాని అయితే దేశానికి ప్రమాదకరమని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. శుక్రవారం తన యూపిఏ పాలనపై వివరణ ఇచ్చేందుకు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. యూపిఏలో రెండు అధికారం కేంద్రాలు లేవని చెప్పారు. రాహూల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అంటూ ఆయన దాదాపుగా ఓకే చేసారు. మోడి నాయకత్వం మాత్రం మంచిది కాదన్నారు. ఆయన ప్రధాని అయితే దేశానికి వినాశకరం అంటూ వాఖ్యానించారు. గుజరాత్ మారణ కాండ మళ్లీ జరగాలని దేశం కోరుకోవడం లేదని తెలిపారు. ఇక పదేళ్ల తన పాలనలోని ఎత్తు పల్లాలను ఆయన సవివరంగా వివరించారు. రాహూల్ సమర్థుడైన నాయకుడు అన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రధానికి బాద్యతలు అప్పగిస్తానని చెప్పారు. పార్టీ కొత్త తరానికి అనుగునంగా ముందుకు పోతోందని చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని సారథ్య బాద్యతలు అప్పగిస్తారని చెప్పారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికలు ప్రజల మనోభావాలకు, వారు కోరుకుంటున్నదానికి అద్దం పట్టాయని చెప్పారు. నాకు రాజీనామా చేయాలని ఎప్పుడు అన్పించలేదని చెప్పారు. తాను ప్రధానిగా రాగద్వేషాలకతీతంగా పనిచేసానని చెప్పారు. పార్టీ నాకెప్పుడు అండగానే ఉందని చెప్పారు. ఇలా తానొవ్వక నొప్పించక తన పని ఇక ఇంతటితో ఖతం అయింది అని పరోక్షంగా చెప్పేసారు ప్రధాని మన్మోహన్.

మరింత సమాచారం తెలుసుకోండి: