నిరుపేద ప్రజల పెన్నది ప్రస్తుతానికి ప్రాణాలతోనే ఉన్నాడు. .అన్నార్థుల ఆపద్భాందవుడు రాజశేఖరుడు ఇంకా బతికే ఉన్నాడు. ఉచితవిద్యుత్తుతో ఆరుగాలం కష్టించే అన్నదాత పంటపొలాల్లో తిరుగాడుతున్నాడు. రెండు రూపాయల బియ్యంతో రెండు పూటలా తింటున్న పేడోడి కంచంలో అన్నం ముద్దై కనిపిస్తున్నాడు. పావలా వడ్డీతో మహిళాసాధికారత వైపు అడుగులు వేస్తున్న మహిళ చిరునవ్వుల్లో చిందేస్తున్నాడు. ఆరోగ్యశ్రీతో ఆపద తప్పిన పేదగుండె లయల చప్పుడై వినిపిస్తున్నాడు. అవసానదశలో పింఛను అందుకున్నవారి కళ్లల్లో వెలుగై కాంతులు కురిపిస్తున్నాడు. గూడులేని బడుగులు నివాసముంటున్న ఇందిరమ్మ ఇళ్లలో సేదతీరుతున్నాడు. రెక్కాడితేకాని డొక్కాడని వ్యవసాయకూలీలకు ఉపాధినిచ్చి పల్లెల్లో పరుగులు తీస్తున్నాడు. నోళ్ళు తెరిచిన బీడుభూముల దాహం తీర్చేందుకు నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్టుల్లో నిఘా సారిస్తున్నాడు. తాను ప్రవేశపెట్టిన పథకాలు. ప్రాజెక్టులు కాంగ్రెస్ కంకణం కట్టుకుని నిర్వీర్యం చేసిననాడు రాజశేఖరుడు నింగిచేరినట్టే. ఆపై తుదిశ్వాస విడిచినట్టే. ప్రజల కష్టనష్టాలు తెలిసిన వారే పాలకులు. ప్రజలనాడీ కనిపెట్టిన వాడే నాయకుడు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభీక్షంగా ఉంటుందని నమ్మిన వారే ఏలికలని తెగేసి చెప్పిన రాజశేఖరుని మాటలు ఎన్నటికీ మరువజాలనివి. ఉచిత హామీలు ఇవ్వడం ఆయన చేతకాదు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం మడమ తిప్పని నైజం వైఎస్ ది. నిత్యం ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉన్న ఏకైక నాయకుడిగా ఆయన గడించిన ఖ్యాతి ఇంకెవ్వరీ సాథ్యం కాదు. నిరుపేదల కోసం ఆయన రూపొందించిన ఆరోగ్యశ్రీ. ఉపాధి హామీ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శమైన సంగతి విధితమే. అధికార దుర్వినియోగం చేసి వైస్ఆర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాడని’దేశం‘ కోడై కూస్తున్నా ప్రజలు మాత్రం రాజశేఖరుడు తమ గుండెల్లో గూడుకట్టుకున్నడని తేల్చిచెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వైఎస్ పాలన సాగించడని చెప్పవచ్చు. మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకంతో మహిళామణుల్లో ఆత్మస్థైర్యం వెల్లువెరిసింది. రాజీవ్ యువశక్తితో యువతకు ఉపాధి కల్పించి నిరుద్యోగ సమస్యను కొంతమేర తగ్గించాడు. కాగా ఆయన మరణాంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సైతం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మహానేత మరణం తట్టుకోలేక వందలాది మంది అభిమానులు తనువుచాలించిన విషయం తెలియంది కాదు. దీంతో ఆయన తనయుడు యువనేత చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడం ఆపై అవమానించడం జరిగిన తతంగం విధితమే. ఈక్రమంలో యువనేత జగన్ వైకాపా పార్టీ స్థాపించడం అనతికాలంలోనే రాష్ట్రంలో రాజకీయ ప్రభంజనం స్రుష్టించడం జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ వర్గీయులు యువనేతపై ఉన్న ఆగ్రహాన్ని మహానేతపై తీర్చుకోవడం ఆరంభించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను హైజాగ్ చేయడమే కాకుండా వివిధ పథకాల్లో ఆయన ముఖచిత్రాన్ని కనిపించకుండా చేశారు. గోడలపై ఉన్న వైఎస్ బొమ్మను చెరపడంలో కాంగ్రెస్ విజయం సాధించింది.  కానీ ప్రజల గుండెల్లో ఉన్న వైస్ఆర్ చిత్రాన్ని చెరపతరం ఎవరి’చేత‘కాదని తెలుసో తెలియదో మరి..? వైఎస్ పాలన తిరిగి రావాలని? దమ్మున్న నేత అధినేతగా కావాలని? పేదల కష్టాలు తెలిసిన పాలకుడు ఏలికవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు పుష్కలంగా ఉన్నది యువనేతకే అన్నది జగ(న్)మెరిగిన సత్యం. వైఎస్ లేని లోటును ఆయన ప్రవేశపెట్టిన పథకాలలో చూసుకుంటున్న ప్రజలు యువనేతకే పట్టం కడతారని సర్వేలు సైతం తేల్చిచెబుతున్నాయి. ఏడాదిన్నర ఆగితే ఏలికలెవరో? తెలిసిపోతుంది. వేచిచూద్డామా మరి..?  

మరింత సమాచారం తెలుసుకోండి: