నన్ను ప్రపంచం అంతా మెచ్చుకునేలా చూసుకునే అమ్మాయి కాదు, నన్నే తన ప్రపంచంగా చూసుకునే అమ్మాయి కావాలి. తన నవ్వుల్లో నా ఆనందం కొలువై ఉండాలి తన అడుగుల్లో నా పయనం సాగిపోవాలి తన మాటల్లో నా భావం వెల్లివిరియాలి తన ప్రేమలో నా జీవితం వెలుగొందాలి నా కళ్ళల్లో తన సంతోషం కనిపించాలి నా గుండెల్లో తన రూపం దాగిపోవాలి నా ప్రాణాల్లో తన ప్రాణం కలిసిపోవాలి నా ఊపిరిలో తన శ్వాసే నిలిచి తీరాలి ఆత్మీయతకి తన రూపం అద్దం పట్టాలి ఆప్యాయతకి తను ప్రతిరూపంగా ఉండాలి నా భావాలకి తను నిఘంటువుగా మారిపోవాలి నా జీవితానికి తనొక మధురకావ్యంగా ఉండిపోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: