ఈనాడు లోకమే ఒక రణరంగం అందులో అతిపెద్ద ఆయుధం రాజకీయం నేతల చేతిలో క్షుద్రమంత్రం రాజకీయం బలహీనులపై నాయకుల అస్త్రం రాజకీయం మరణశాసనాలు రాసిన గ్రంథం రాజ్యాంగం మరణదండనను సైతం మార్చివేసేది రాజకీయం అగ్నిగుండానికి నిలువెత్తు నిదర్శనం రాజకీయం దీనిలో అడుగుపెట్టాక భస్మమవటమనేది ఖాయం మన విధులతో పరమావధిగా సాగడం జీవితం అందరి విధులను మన విధిగా చేసుకోని సాగడం అసలైన రాజకీయం కానీ ఈనాడు….. చిక్కిన అవకాశాన్ని దక్కించుకోవడం మానవీయం చిక్కని అవకాశం కోసం చేసే ప్రయత్నం రాజకీయం మన హక్కులకోసం మనం చేసే పోరాటం ఆనందనీయం అభినందనీయం పరులహక్కుల ధ్వంసం చేయడం కోసం ఆరాటం రాజకీయం

మరింత సమాచారం తెలుసుకోండి: