నా గొంతు శంఖమై నీ నామాన్నే పూరిస్తున్న వేళ నా మోము అద్దమై నీ రూపాన్నే చూపిస్తున్న వేళ నా జీవితం పొద్దుతిరుగుడై నీ చూపులకే ఎదురుచూస్తున్న వేళ నా గుండెచప్పుళ్ళే ఢమరుకనాదాలై నిన్ను పిలుస్తున్న వేళ నన్ను నీ కనుచూపుల కొలిమిలో కాలనివ్వు నీ ఆపాదమస్తకాన్ని చుంబించే వరానివ్వు నన్ను నీ వెలకట్టలేని చెలిమిలో నిలవనివ్వు ఈ వెన్నెలరాత్రిలో ఆ చంద్రుని సాక్షిగా నీతో ఒకటికానివ్వు

మరింత సమాచారం తెలుసుకోండి: